జగ్గంపేట
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగతా సిద్దు వైద్య ఖర్చుల నిమిత్తం పూర్వ విద్యార్థులు 21500 రూపాయలు ఆర్థిక సాయం గా అందించారు. జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన జగతా దుర్గాప్రసాద్ కుమారుడు సిద్దుకు బ్రెయిన్ లో నరాలకు నీరు పట్టడం జరిగింది. తల్లిదండ్రులు హైదరాబాద్ వరకు ఆసుపత్రులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో బెంగళూరు ఆసుపత్రిలో చూపించగా పరీక్షలలో మెదడుకు సంబంధించిన చిన్న నరంకు నీరు పట్టిందని వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉంచాలని తెలిపారు. వైద్య నిమిత్తం ఎనిమిది లక్షలు దాటి ఖర్చవుతుంది అన్నారు. సాధారణ కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ముసిరెడ్డి నాగేశ్వరరావు అనే యువకుడు వాట్సాప్ ఫేస్బుక్లలో సహాయం కోసం అర్థించారు. తనకు పరిచయమున్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఆ కుర్రాడు ఆరోగ్యం గురించి సాయం చేయమని కోరాడు. ఫలితంగా సుమారు మూడు లక్షలు దాటి దాతల సహాయం అందింది. సోషల్ మీడియాలో బాబు గురించి తెలుసుకున్న జగ్గంపేట ఉన్నత పాఠశాల 1974- 75పూర్వ విద్యార్థులు కొద్దిపాటి సాయాన్ని అందించడం జరిగింది. గ్రామ సర్పంచ్ సీతారామయ్య, ఉపసర్పంచ్ ముసిరెడ్డి నాగేశ్వరరావు ఇతర పెద్దల ఆధ్వర్యంలో 21,500 రూపాయలను సిద్దు తండ్రికి అందించారు. పూర్వ విద్యార్థులు స్థానిక టిడిపి నాయకులు కుంచే సీతారామయ్య( తాతాజీ ) జర్నలిస్ట్ అడపా వెంకట్రావు, రిటైర్డ్ హెచ్ఎం కే ఉదయ భాస్కర్, రిటైర్డ్ ఆర్ ఐ నీలి లోవ ప్రకాష్, ఎస్ వి వి అప్పారావు, మానేపల్లి వీరేశ్వర రావు చేతులు మీదుగా ఈ సొమ్మును అందించారు. ముఖ్యఅతిథిగా వచ్చినసర్పంచ్ సీతారామయ్య స్పందించి తన ఆర్థిక సాయం గా అయిదు వేల రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన సిద్దు ఆరోగ్యానికి ఆర్థిక సాయం అందజేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా 5 లక్షల వరకు ఒక వారం రోజుల్లో ఆ బాలునికి సమకూర్చవలసి ఉంటుందన్నారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.