- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
అనంతపురం నగర సమీపంలోని బుక్కరాయసముద్రం వద్ద నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి
జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి వివరించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇరిగేషన్ ఛానల్ ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. విజయవాడలోని ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం వివిధ విద్యా సంస్థలు, ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రహరీ గోడ నిర్మాణ పనులను మొదలు పెట్టడం జరిగిందని సీఎస్ కు తెలిపారు. యూనివర్సిటీకి విద్యుత్ సరఫరా చేసేందుకు 33 కేవీ సబ్ స్టేషన్ ను మంజూరు చేస్తామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవో గ్రంధి వెంకటేష్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనుమాన్ కెనడి, సెంట్రల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ జి.రామిరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు, పీఆర్ ఎస్ఈ భాగ్యరాజ్, ఎపిఎస్పీడీసిఎల్ ఎస్ఈ సురేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇషాన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.