తనకల్లు :ప్రమాదవ శాస్తూ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోవాడంతో ఇల్లు కట్టు కోలేని స్థితిలో ఉన్న నిరు పేద కు మరమత్తులు కోసం కొక్కంటి క్రాస్ సత్యన్న సేన సభ్యులు సిమెంట్ ఇటుకులు సహాయం చేసారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఉబిచెర్ల గ్రామానికి చెందిన దడిగిల రెడ్డెప్ప గత నెల 15 తేదిన కుటుంబంతో కుమార్తె వివాహానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా గుర్రం కొండ కు వెళ్లగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలి ఇల్లు నేల మట్టం కావడం తో పాటు చాలా వరకు నష్టం వాటిల్లింది.ఇల్లు లేక రోడ్డు న పడ్డ కుటుంభాన్ని సత్యన్న సేన సభ్యులు విషయాన్ని తెలుసుకొని. మావంతు సహాయం చేస్తామని రూ.7వేలు విలువగల సిమెంట్ ఇటుకలను అందజేశారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, తోటివారికి సహాయం చేయడం సత్యన్న సేన సభ్యులకు సంతోషం అన్నారు, బాధితుడు రెడ్డిప్ప మాట్లాడుతూ ఇల్లు కూలిపోయి నష్టపోయిన నాకు సమస్యను గుర్తుంచి నాకు సహాయం చేయడంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని,ఉండటానికి తాత్కాలికంగా ఇల్లు కట్టుకోవడానికి ఒక లోడ్ సిమెంట్ ఇటుకులను సత్యన్న సేన కొక్కంటి క్రాస్ సభ్యులు అందజేయడం గొప్ప విషయమని బాధితుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్యన్న సేన సభ్యులు
సద్దగుంట్ల విశ్వనాథ్, జయచంద్ర, ద్వారకనాథ్ కొండ, బాగేపల్లి అశోక్, గోవిందు బాలకృష్ణ, బక్కసం నవీన్