రెడ్ క్రాస్ సొసైటీ కి రూ 1,01,116 విరాళాలు అందించిన డా బెగ్ ను అభినందించిన కలెక్టర్
రెడ్ క్రాస్ సొసైటీ కి లక్ష విరాళం అందించిన గన్ని భాస్కర్ రావు
సమాజ సేవలో రెడ్ సేవలు ఆదర్శం
కలెక్టర్ మాధవీలత
ప్రజాభూమి రాజమహేంద్రవరం
ప్రజలు ప్రతి ఒక్కరూ తమ స్థాయి కి తగిన విధంగా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు.
సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలిసిన బెగ్ కుటుంబ సభ్యులు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కి లక్షా పదహారు రూపాయల విరాళం చెక్కు ను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమండ్రికి చెందిన డాక్టర్ డా అజమ్తుల్లా బెగ్ , ఆయన కుమారుడు మొహమ్మద్ గౌస్ నవాజ్ బెగ్ లు రెడ్ క్రాస్ సొసైటీ కి తమ వంతుగా లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల ను అందించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తమ వంతు సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. వాటిని సమర్థవంతంగా చేపట్టడంలో ప్రజల సహకారం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే తరహాలో రెడ్ క్రాస్ సొసైటీ కి విరాళాలు అందించిన వారిని కలెక్టర్ అభినందించారు. జి ఎస్ ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గన్ని భాస్కర రావు తన వంతు సహాయంగా లక్ష రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. మరికొందరు స్ఫూర్తి పొంది మరింత మంది ముందుకు రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు .ఈ కార్యక్రమంలో డిఆర్వో జి. నరసింహులు, తహశీల్దార్ సుస్వాగతం పాల్గొన్నారు.