ప్రజాభూమి రాజమహేంద్రవరం
ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వర పరిష్కారం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు వాటి వివరాలు మార్గదర్శకాలు మేరకు ఆన్లైనలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత పేర్కొన్నారు
సోమవారం కలెక్టరేట్ లో ప్రజల నుంచి కలెక్టర్, ఎస్పీ పి. జగదీష్, జేసీ తేజ్ భరత్ లు అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, సోమవారం పరిపాలన పరమైన, పోలీస్ శాఖకు చెందిన 192 అర్జీలు వచ్చాయన్నారు. ప్రతిరోజూ జేకేసి పోర్టల్ ను సందర్శించి శాఖల వారీగా ఉన్న అర్జీలను 24 గంటల్లో ఓపెన్ చేసి, ఇచ్చిన కాల పరిమితి లోగా పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, పంచాయతీ శాఖల కు చెందిన 6 అర్జీలు ఎస్ ఎల్ ఏ కాలపరిమితి లోగా పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పరిపాలన సంబంధమైన 152 అర్జీలలో రెవెన్యూ, పంచాయతి రాజ్ ,తదితర శాఖలకు చెందిన అంశాలపై అర్జీలు వచ్చాయన్నారు.
నిర్దిష్ట సమయంలోగా పరిష్కారం కానీ ఆరు అర్జీలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, మద్యం, తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి వారి పై, వారిని ప్రోత్సహించే వారిపై పిడి కేసులను నమోదు చేస్తామని అన్నారు. ఇప్పటికే కేసులు నమోదు చేసిన వారికి మద్దతు తెలుపుతూ అర్జీలు ఇచ్చే వారి విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్పందనలో అధికారులకు ఇచ్చిన అర్జీలను తప్పని సరిగా ఆన్లైన్ లో నమోదు చేసుకుని, తగిన రశీదు పొందాలని సూచించారు.
ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కటినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్న, మాదక ద్రవ్యాలు సేవిస్తూన్నా, కలిగి ఉన్నా వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది
సివిల్ తగాదాలకు చెంది భూ వివాదాలకు దారి తీసే కేసులు నమోదు కోసం అర్జీలు రావడం జరుగుతొందని, సామరస్య చర్చలు ద్వారా పరిష్కారం చేసుకోవడం కేసు ఇరు పక్షాలు రాజీ పడడం వల్ల త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పోలీసు శాఖ పరిధికి చెందిన 40 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. వాటి సత్వర పరిష్కారం కోసం స్టేషన్ హౌజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ , రీ ఓపెన్ అయిన అర్జీలను పరిష్కారం చేస్తున్నా తిరిగి వస్తుండడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పంచాయతీ అనుబంధ శాఖల కి చెందిన శానిటేషన్ , ఆక్రమణలు , సిబ్బంది పనితీరుపై , రెవెన్యూ భూ సంబంధ, రీ సర్వే , పోలీస్ శాఖ కి చెందిన నాలుగు అర్జీలు ఉన్నాయన్నారు. అర్జి పరిష్కారం చేసేకా ఫోటో అప్లోడ్ చెయ్యాల్సి ఉందన్నారు.
స్పందనలో వొచ్చిన ఆర్జిలు:
బందపురం గ్రామంలో ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న కాలనీలో మౌలిక సదుపాయాలు [సిసి రోడ్డు, (డ్రైనాణ వ్యవస్థ, విద్యుత్ దీపాలు, పారిశుధ్య నిర్వహణ పై దండోరా, ప్రభుత్వ కుళాయి ఏర్పాటు కల్పనలో పంచాయతి సెక్రటరీ చర్యలు తీసుకోవాలని దేవరపల్లి మండలం బందపురం కి చెందిన పెదవేగి సత్య ప్రకాష్ అర్జి అందచేశారు.
వేణుగోపాల గుడి వద్ద, 22 వ వార్డు, రాజమండ్రిని చెందిన భాగవతి నాగలక్ష్మి వారి తల్లిగారైన బి. భారతి గారికి పెన్షన్ నెం: 110750160 వృద్ధాప్య పింఛను వేలిముద్ర పడటం, లేదనే కారణంతో నిలిపి వేసినారు. ఒక రైసుకార్డుపై 2 పింఛన్లు ఇవ్వటం ఇవ్వడం సాధ్యం కాదని తెలియ చేసియున్నారు. ఇప్పుడు నేను విడిగా రైసుకార్డు తెచ్చు కారణంగా తిరిగి మా అమ్మగారి పింఛను ఆమెకు అందే విధంగా వెలినవారు చర్యలు తీసుకొనగలరని వారి అర్జిలో కోరి ఉన్నారు. పిడి డిఆర్డీఏ ఆమేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెరవలి మండలం ఖండవల్లి గ్రామం 7 వ గ్రామ సంఘంకి చెందిన కిరణ్మయి డ్వాక్రా సంఘా సభ్యులు కె. మణి, కె. విజయలక్ష్మి, గంట దుర్గ లు గతంలో గ్రామ వి వో శ్రీదుర్గ శ్రీనిధి వాడుకుందని, అధికారులు విచారించి ఆమె నుండి కొంచెం వసూలు చేసి, మిగిలినది పలుదఫాలుగా కట్టేటట్లు మాట్లాడడం జరిగిందన్నారు . ఇదే విధంగా మరికొన్ని గ్రూపుల నుంచి శ్రీ నిధి దుర్వినియోగం ఇంకను కొంచెం శ్రీనిధి బ్యాలెన్స్ కట్టవలసియున్నది. ఇదే మాదిరి కొన్నిగ్రపులకు కూడా శ్రీనిధి నిధులు దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నరు. స్పందన లో గతంలో ఫిర్యాదు చేసినందున పెరవలి ఎపీఎం , సిసి కాకర్ల రమేష్ హెచ్చరించి దూషిస్తూ న్నట్లు, తగిన చర్యలు తీసుకోవాలని అర్జి అందచేశారు. పిడి డిఆర్డీఎ వారిని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.
ఈ స్పందన కార్యక్రమం లో డి ఆర్వో జి. నరసింహులు, అదనపు ఎస్పీ (ఏ) ఆర్ రాజశేఖర రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ , టూరిజం అర్ డి వి. స్వామి నాయుడు, కే ఆర్ ఆర్ సి ఎస్ డి టి కృష్ణ నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.