Thursday, November 28, 2024

Creating liberating content

సినిమాహనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ పొడగింపు..

హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ పొడగింపు..

చిన్న సినిమాగా ప్రారంభమై భారీ చిత్రంగా మారింది హనుమాన్. మొదట తెలుగుతోపాటు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మిద్దామనుకున్న హనుమాన్ మూవీ ఏకంగా అంతర్జాతీయ భాషల్లో సైతం విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో హనుమాన్ సినిమా రిలీజైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న హనుమాన్ మూవీ ఓటీటీ విడుదల తేది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు గానీ, మార్చి రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు జీ5 సంస్థ నుంచి వచ్చిన సమాచారం. అంటే మార్చి 8న శివరాత్రి సందర్భంగా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే హనుమాన్ మూవీ విడుదలైన 17 రోజులు కావొస్తుంది. ఇంకా కొన్ని థియేటర్లలో హౌజ్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీ ఉంది. దీంతో హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌ను పొడగించినట్లు తెలుస్తోంది. కానీ, హనుమాన్ మూవీని ఓటీటీలో చూడాలంటే ఇంకా నెలకుపైగా ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article