అగనంపూడి :
జీవీఎంసీ 85 వ వార్డు అగనంపూడి పునరావాస కాలనీ దిబ్బపాలెం స్కూల్ గ్రౌండ్ లో స్టార్ స్టార్ డం స్కూలు ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సంభంగి రంగారావు పాఠశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు ముఖ్య అతిథలు జిల్లా ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ వైస్ ప్రిన్సిపాల్ బొడ్డు రవి విశాఖ జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఏ గౌరీ శంకర్ అతిధులు జ్యోతి ప్రజ్వలన చేశారు . అనంతరం వారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్పాలని దానితోపాటు క్రమశిక్షణ అంకితభావం ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కరస్పాండెంట్ ఎస్ రంగారావు స్కూలు లో విద్యార్థులు ఉత్తమంగా తయారు చేస్తారని చాలా అనుభవం ఉందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మి రెడ్డి శివ శంకర్ రావు మాట్లాడుతూ ఎస్ రంగారావు అతి తక్కువ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఏడు శాఖలు పాఠశాలలో ప్రారంభించడం బట్టి పిల్లలకు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లతారనే తల్లిదండ్రులు కు భరోసా ఇవ్వడమే కారణమైన అన్నారు.
ప్రిన్సిపాల్ సంభంగి నాగభూషణ్ సభ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గాజువాక నియోజకవర్గం వైయస్సార్సీపి ఇంచార్జ్ ఉరుకుటి రామచంద్రరావు 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జి పూర్ణానంద శర్మ 85 వార్డు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఇల్లపు ప్రసాదు ఎడిసి చైర్మన్ బలరెడ్డి సత్యనారాయణ 79 85 వార్డుల జనసేన పార్టీ అధ్యక్షులు గవర సోమశేఖర్ మేడిశెట్టి విజయ్ టిడిపి నాయకులు నెల్లి శ్రీనివాసరావు 85వ వార్డ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బొర్ర సోమినాయుడు సి మధుసూదన్,కర్రీ రమణమ్మ మరియు స్థానిక నాయకులు, విందుల వెంకటరమణ, ఎల్వి రమణ, ఎలమంచిలి పెద్ద అప్పారావు చిన్న అప్పారావు దాన బాల నాయుడు బంధం అప్పలరాజు మామిడి రాము పిల్ల రామకృష్ణ ,తోకాడ రాము, తోటాడ చంద్రమౌళి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన అతిథులను పాఠశాల యాజమాన్యం సత్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ సంభంగి రంగారావుని వచ్చిన అతిథులు ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సంస్కృత ప్రదర్శనులు అబ్బుర పరిచాయి.