మానవతా. సేవా సంస్థ సెక్రటరీ గుంటక.వనజాక్షి, చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో
మార్కాపురం :మార్కాపురం పట్టణంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురం మానవతా శాఖ కన్వీనర్ గుంటక వనజాక్షి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సభ్యులకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన సభ్యులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి.ఎల్.ఎఫ్ అధ్యక్షురాలు దొడ్డ భాగ్యలక్ష్మి ఉపాధ్యక్షురాలు కాలువ దుర్గ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనజాక్షి గారు మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతంగా ఉంటేనే ఆ ఇల్లు మొత్తం చైతన్యంగా ఉంటుంది అని సమాజంలో మహిళల పాత్ర గణనీయమైనదని మహిళలు ఆర్థికంగానూ సామాజికంగానూ అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపిణి అని మానవతా సంస్థ ద్వారా మార్కాపురం పట్టణంలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని ప్రకాశం జిల్లాలోని మానవత శాఖలలో మహిళా సభ్యులు ఎక్కువగా మార్కాపురం శాఖలో ఉన్నారని ఆవిడ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మానవతా శాఖ అధ్యక్షులు సూరె వెంకటేశ్వర్లు సెక్రటరీ గుంటక చెన్నా రెడ్డి, ఉపాధ్యక్షులు పివి కృష్ణారావు , సంస్థ సభ్యులైన శాసనాల రంగనాథ్ నూకని సుజాత తాళ్ల భాగ్యలక్ష్మి, ఊటుకూరు భాగ్యలక్ష్మి, కామిశెట్టి మల్లేశ్వరి, రాయల చంద్రకళ, అన్నపురెడ్డి సుధారాణి , మక్కల సరిత, బత్తుల రమణమ్మ, కె రేణుక, కె ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో బహుమతి ప్రదాతలుగా జగదాంబ శారీస్ అండ్ డ్రెస్సెస్ శ్రీమతి దేవి శెట్టి దుర్గ, శ్రీ వెంకటేశ్వర ఫాన్సీ షాప్ ఊటుకూరి భాగ్యలక్ష్మి ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ దివ్య తేజ వ్యవహరించారు.