ఏలేశ్వరం:-అందరికీ ఆరోగ్యం అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సూరక్ష కార్యక్రమాన్ని వరుపుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బీద బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ పథకం ద్వారా పలు రకాల వైద్య పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీసెట్టీ అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ రామిసెట్టి రమణ, గుల్లంపుడి గంగాధర్, నీరుకొండ అర్జునరావు, బుద్ధ గణేష్, దాసరి రమేష్, వైద్యులు అప్పారావు ,నర్సులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.