ప్రముఖకవి,రచయిత షాన్ రెంజర్ల
అట్టహాసంగా శలపాక గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రముఖకవి,రచయిత షాన్ రెంజర్ల
అట్టహాసంగా శలపాక గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రజాభూమి, కాజులూరు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కొందరికే పరిమితం కాదని ,ఆయన అందరివాడని ప్రముఖకవి,రచయిత,అభ్యుదయవాధి,షాన్ రెంజర్ల రాజేష్ అన్నారు. ఈమేరకు సోమవారం శలపాక గ్రామంలో శ్రామిక దినోత్సవం పురస్కరించుకుని
డాక్టర్. బి.ఆర్ అంబేడ్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ కవి, రచయిత, అంబేడ్కర్ అభ్యుదయవాధి షాన్ రెంజర్ల సభావేదికపై మాట్లాడుతూ అంబేద్కర్ కొందరికే పరిమితం కాదు ,ఆయన అందరివాడు అన్నారు.ఆయన భారత రాజ్యాంగాన్ని రచించడమే కాక,అన్నివర్గాలకు హక్కులు కల్పించాడని ఈసందర్భంగా గుర్తుచేశారు.ఆయన రాత్రి పగలు నిద్దరపోకుండా భారతదేశ జనాభాకోసం భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. శ్రామికులకు పనిదినాల్లో 14గంటలు సమయాన్ని 8గంటలకు కుదించినది డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని వివరించారు. శ్రామికులకు ,ఉద్యోగస్తులకు ఎన్నో హక్కులు కల్పించడం జరిగిందన్నారు. ఈ దేశప్రజలకు ఆయన సేవలందించేందుకు తన నలుగురు బిడ్డలను పోగట్టుకున్నారనిఅన్నారు. ఆయన నిరంతరం చదువుతూనే ఉండేవాడని వివరించారు.పార్లమెట్‌లో స్త్రీలకు సమాన హక్కు కల్పించాలన్న అంశాన్ని లేవనెత్తనిప్పడు నాటి ప్రభుత్వం దానికి ఒప్పుకోని కారణంగా ఆయన న్యాయశాఖ మంత్రిపదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఈసందర్భంగా సూచించారు.ఈసందర్భంగా రాజేష్, రజని చేతులమీదుగా ఇంటర్మీడియేట్ ప్రధమ సంవత్సరంలో అత్యధిక మార్క్‌లు సాధించిన గండి ధనలక్ష్మి,పొట్లకాయల కీర్తన,దడాల బాలాజీ, దడాల శ్రీనిధి,వడ్డపాటి దుర్గాదేవి,వడ్డపాటి అనూష తదితరులకు బహుమతులు అందజేశారు.జైభీమ్ కార్యక్రమానికి షాన్ రాజేష్‌తోపాటు,పొలుగుమాటి నరసింహమూర్తి (దుగ్గుదూరు),మరో వక్త పుణ్యమంతుల మాతా రమాభాయి (అమలాపురం ,అంబేడ్కర్ మహిళాసంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు)గానకోకిల గిడ్ల వరప్రసాద్ ,అడ్వకేట్ భరత్ కుమార్, పోతు శ్రీనివాస్,శలపాక జైభీమ్ యూత్ సభ్యులు,ప్రెసిడెంట్ గండి నాగేశ్వరావు,జె.దేవీటీచర్, కిరణ్ కుమార్, పి.సూర్యచంద్రరావు, పోతురాజు భీమారావు,ఉద్యోగస్తులు, శలపాక గ్రామ పెద్దలు, ఎంపీటీసీ దడాల రమేష్, సర్పంచ్ పోతుల గనిరాజు,మహిళా మణులు, దడాల వెంకటరమణ,పులగల సత్తిబాబు, పొట్లకాయల సత్యనారాయణ,పెనుమాల త్రిమూర్తులు, యూత్ సభ్యులు, ఉద్యోగస్తులు, మాత వెంకటేశ్వరరావు, పాల్గొనగా శలపాక గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జయంతికార్యక్రమం నిర్వహించారు. ఇదిలావుండగా గ్రామంలో అంబేడ్కర్ చిత్ర పటాన్ని ,గారిడీలతో సందడి చేస్తూ
భారీ ఊరేగింపు కొనసాగించారు.