Thursday, November 28, 2024

Creating liberating content

Uncategorizedఅక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి

అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి

కాకినాడరూరల్

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎం.ఎస్. ఎన్ పీజీ క్యాంపస్ ప్రాంగణంలో శుక్రవారం బిర్సా ముండా 150వ జయంతిని ప్రోగ్రాం కన్వీనర్ డా ఎల్ మధు కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సంప్రదాయలు పాటించటం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం అలాగే అడవి, చెట్టు పుట్ట, నీటి రక్షణ కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నవ యువకుడు బిర్సా ముండా అందరికీ ఆదర్శమన్నారు. అలాగే గిరిజనులు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ వికాసానికి కృషి చేయాలని కోరారు.మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రశాంతిశ్రీ మాట్లాడుతూ తర తరాలుగా వికసించిన గిరిజన గ్రామీణ స్వావలంబాన పద్ధతులను ప్రజాస్వామ్య వ్యవస్థ గా పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకులు డా నాని బాబు ప్రసంగింస్తూ ప్రతి ఒక్కరు బిర్సా ను ఆదర్శంగా తీసుకుని మానవతా విలువలు పాటిస్తూ జీవితంలో ఉన్నత దశలో చేరుకుని దేశసేవలో భాగస్వామ్యులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డా అజయ్ రతన్,నదీమ్, డా స్టీఫెన్, డా హారిక, వరప్రసాద్, డా హరిబాబు,మనికంటేశ్వరారెడ్డి డా అప్పారావు, డా శ్రీదేవి, మనోజ్, డా గోపి ,శ్రీనివాస్, డా హేమలత, డా విజయశ్రీ,డా ఉమారజిత బోధననేతర సిబ్బంది శ్రీనివాస్ , సూరిబాబు,హరిబాబు, సత్తిబాబు, సంతోష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article