హిందూపురం టౌన్
అధికార పార్టీ అండతో అక్రమ ఇసుక రవాణా చేయడం తగదని సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం మండలం అప్పలకుంట సమీపంలో ఉన్న పెన్నా నదిలో అధికార పార్టీ అండతో ఒక ప్రైవేటు సంస్థ ఇసుక రీచ్ కు అనుమతులు పొందిందన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లు పెద్ద లారీలలో ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికారులు దగ్గరుండి ఇసుకను తరలించడం చాలా దుర్మార్గపు చర్య అంటూ ఆరోపించారు . వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం ఇసుక లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇసుక రీచ్ లో ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాలకు ఇసుక అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. పెన్నా నది చుట్టూ వేలాది ఎకరాలు రైతులు పంటలు పండించే భూమి ఉందని, పెన్నా నదిలో ఇసుకను తరలిస్తే చుట్టూ ఉన్న భూగర్భ జలాలు అడుగంటిపోయి కనీసం తాగనీళ్లు లేక కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. మరో రెండు నెలల్లో ఈ వైసిపి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, రాము. కొల్లకుంట అంజన్నప్ప, డిఈ రమేష్ కుమార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు