లేపాక్షి: మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్న ఓ మహిళ నుండి 48 కర్ణాటక టెట్రా పాకెట్లనుస్వాధీనం చేసుకున్నట్లు లేపాక్షి ఎస్సై గోపి తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కల్లూరు గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటిపై దాడి నిర్వహించడం జరిగిందన్నారు. ఆ మహిళ ఇంట్లో నిల్వ ఉంచుకొని అమ్ముతున్న కర్ణాటక మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మాట్లాడుతూ, మండల పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్నా, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ ఐ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారినైనా చట్టం ప్రకారం శిక్షించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఈ విషయంలో తమకు సహకరించాలని ఎస్సై గోపి తెలిపారు. ఈ దాడిలో చిలమత్తూరు ఎస్సై గంగాధర్ లేపాక్షి పోలీసు సిబ్బంది ఉన్నారు.