బొండా ఉమామహేశ్వరరావు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు)
ఓటమిభయంతోనే జగన్ రెడ్డి తప్పుడు కేసులు, అక్రమఅరెస్టుల్ని నమ్ముకు న్నాడని, నాలుగున్నరేళ్ల పాలనా కాలాన్ని కేవలం రాజకీయ కక్షసాధింపులకే వెచ్చించిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని, విజిలెన్స్.. సీఐడీ.. సీబీసీఐడీ.. పోలీస్ విభాగాలను తన స్వార్థానికి, తన కక్ష సాధింపులకు వాడుకుంటూ, అభివృద్ధి సంక్షేమాలను పూర్తిగా విస్మరించాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!“ జగన్ రెడ్డి పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు అనడానికి టీడీపీ నేతల అక్రమ అరెస్టులే నిదర్శనం. 10 నెలల క్రితం కేసుపెట్టడమేంటి…ఇప్పుడు కడప లో టీడీపీనేత బీటెక్ రవిని అరెస్ట్ చేయడమేంటి? తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ.. పాలకుల రాజకీయ కక్షసాధింపులకోసం పనిచేస్తున్న ఏ అధికారిని..ఏ విభాగాన్ని వదిలిపెట్టం. తప్పుడు పనులుచేసేవారికి సహకరిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్న అధికారులందరూ కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబడతారు… జైళ్లలో శిక్ష అనుభవిస్తారు. ప్రలోభాలు.. పదవు లు..ఎరవేసి ఇప్పుడు అధికారులతో పనిచేయించుకుంటున్న జగన్ రెడ్డి, అధికారం కోల్పోగానే రాష్ట్రం నుంచి పారిపోతాడు. అతని మాట విని రాజ్యాంగాని కి విరుద్ధంగా..చట్టవ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఎక్కడికి వెళ్తారు? చట్టాన్ని అతిక్రమించి.. జగన్ రెడ్డి మెప్పుకోసం అతను విసిరే ఎంగిలి మెతుకులకోసం ఆశ పడి హద్దులుమీరి పనిచేసే అధికారులు మాత్రం కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. జగన్ రెడ్డి అధికారానికి.. అక్రమ అరెస్టులకు టీడీపీ భయప డదు. తెలుగుదేశం నేతలమైన మేమంతా ఎప్పుడూ ప్రజలపక్షాన పోరాడుతూ.,. ప్రజల్లోనే ఉంటాం. మమ్మల్ని మా పోరాటాన్ని జగన్ రెడ్డి తప్పుడు కేసులు ..అక్రమ అరెస్ట్ లతో అడ్డుకోలేడు.హద్దులుదాటి వ్యవహరిస్తూ జగన్ రెడ్డి కిరాయి సైన్యంలా పనిచేస్తున్న ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టంటీడీపీ నేతల్లో జగన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు చెప్పండి? అచ్చెన్నాయుడు.. కొల్లు రవీంద్ర…యనమల రామకృష్ణుడు.. కాలవ శ్రీనివాసులు.. చినరాజప్ప.. అయ్యన్నపాత్రుడు ఇలా అందరిపై తప్పుడు కేసులు పెట్టించాడు. సీఐడీ అధికారులు అర్థరాత్రి గోడలు దూకి వెళ్లి మరీ అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. ఈ విధంగా హద్దుదాటి వ్యవహరిస్తున్న ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టం. ఎస్సై నుంచి ఎస్పీవరకు ఎవరినీ వదిలిపెట్టం. సీఐడీ అధికారులు.. కొందరు పోలీస్ అధి కారులు జగన్ రెడ్డి కిరాయి సైన్యంలా పనిచేస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై.. జగన్ రెడ్డి ఫోటోపై ప్రమాణం చేసి పోలీసులు విధుల్లో చేరారా..లేక రాజ్యాంగంపై ప్రమాణం చేసి పోలీసులుగా మారారా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో..మరో రెడ్డి చెప్పాడనో ఇష్టానుసారం పనిచేస్తారా? తప్పుడు కేసుల్ని ఎలా ఎదుర్కోవాలో టీడీపీ నేతలకు తెలియదనుకుంటున్నారా? ఎంతమందిని ఇలా అరెస్ట్ చేస్తారు?ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్ రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయంజగన్ రెడ్డి సమయం అయిపోయింది. అతనికి ఇంక మిగిలింది మూడునెలలే అని గుర్తుంచుకోండి. త్వరలోజరగబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మరుక్షణం జగన్ రెడ్డి పెట్టేబేడా సర్దుకొని తాడేపల్లి కొంపకు తాళమేసి రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయం. ఆ విషయం కొందరు పోలీసుఅధికారులు..మరీ ముఖ్యంగా సీఐడీ విభాగం గుర్తుంచుకుంటే మంచిది.అచ్చెన్నాయుడు..లోకేశ్..ఇతర టీడీపీనేతలు బీటెక్ రవి..ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శిస్తారు. జగన్ రెడ్డి ఎంతమందిని అడ్డకుంటాడో చూస్తాంటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా టీడీపీ ప్రధాన నేతలు రేపోమాపో కడపకు వెళ్లి బీటెక్ రవిని.. అతని కుటుంబాన్ని పరామర్శి స్తారు. ప్రవీణ్ కుమార్ రెడ్డిని వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. ఎంతమందిని అడ్డుకుంటారో అడ్డుకోండి. ప్రజల్ని.. ప్రతిపక్షాలను.. మీడియాను భయపెట్టి, దొంగఓట్లతో ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. ఇలాంటి తప్పుడు కేసులు, అరెస్టులతో టీడీపీని అడ్డుకోలేడు. టీడీపీ సైన్యం 60 లక్షలకు పైగా ఉంది. మా కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేయిస్తావా జగన్ రెడ్డి? ఈ ముఖ్యమంత్రి.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు చెప్పాయి.జగన్ రెడ్డి పథకం ప్రకారం సాధిస్తున్న రాజకీయ కక్షసాధింపుల్లో పావులుగా మారి.. తమ జీవితాలు పాడుచేసుకోవద్దని కొందరు పోలీస్ అధికారుల్ని హెచ్చరిస్తున్నాంప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద జగన్ రెడ్డి అరెస్ట్ అయి 16నెలల జైల్లో ఉన్నాడు. అతను అవినీతి చేశాడని న్యాయస్థానాలు నమ్మాయి. రూ.43వేలకోట్ల జగన్ రెడ్డి అక్రమార్జనను సీబీఐ ఈడీ నిగ్గుతేల్చాయి. అలాంటి వ్యక్తి సిగ్గులేకుండా అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో ఏ తప్పూచేయని చంద్రబాబునాయుడిని అన్యాయంగా 52రోజులు జైల్లో పెట్టాడు. న్యాయస్థానాలకు సమాధానం చెప్పలేక .. చివరకు మా నాయకుడు తప్పు చేశాడని నిరూపించలేక ఈ జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. రూ.300 కోట్లు చంద్రబాబు తినేశాడని దుష్ప్రచారం చేయడం తప్ప.. ఆయన ఖాతాకు రూ.300లు వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయాడు. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పై కేసు పెట్టి దానిలో చంద్రబాబు, లోకేశ్ ల పేరు చేర్చారు. ఫైబర్ నెట్.. మద్యం..ఇసుక అంటూ రోజుకో తప్పుడు కేసు పెడుతున్నారు. జగన్ రెడ్డికి ఊడిగం చేసే కొందరు మంత్రులు ఇంకా కేసులు పెడతాం అంటున్నారు. ఎన్నికేసులు పెట్టినా మా వెంట్రుక కూడా పీకలేరని జగన్ రెడ్డి అండ్ కో గుర్తుంచుకుంటే మంచిది. జగన్ రెడ్డి పథకం ప్రకారం చేస్తున్న కుట్ర రాజకీయాల్లో పావులుగా మారి.. తమ జీవితాలు పాడుచేసుకోవద్దని కొందరు పోలీసు అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. సెక్షన్ 307 సహా పలు సెక్షన్లు పెడుతున్న పోలీస్ అధికారులు కచ్చితంగా కోర్టలకు సమాధానం చెప్పాల్సిందే. అంగళ్లులో చంద్రబాబు నాయుడిపై హత్యాయత్నం చేసి.. తిరిగి ఆయనపైనే 307 కేసు పెడతారా? పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై 307 కేసుపెడతారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిం దని 70 ఏళ్ల ముసలావిడపై తప్పుడు కేసు పెడతారా? ఇదేనా జగన్ రెడ్డి పాలన… ఇందుకే నా ఇతనికి ప్రజలు 151 సీట్లు ఇచ్చింది? రాష్ట్రంలో చట్టం.. లా అండ్ ఆర్డర్ అమలవుతున్నాయా? అసలు రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడైనా అమలవుతుందా? చంద్రబాబునాయుడిపై….ఆయనకు మద్ధతుగా నిలిచిన వారిపై తప్పుడుకేసులు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్పీ అసలు నిజమైన పోలీసు అధికారేనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే అక్కడ చట్టమా? ఏమనాలి ఇలాంటి వాళ్లని? ఇందుకేనా జగన్ రెడ్డికి ప్రజలు 151 సీట్లు ఇచ్చింది? మార్చి నెలలో జగన్ రెడ్డి రాష్ట్రం వదిలిపోవడం… తాడేపల్లి ఆదేశాలు పాటించి తప్పు చేసిన పోలీస్ అధికారులు మూల్యం చెల్లించుకోవడం తథ్యం.” అని బొండా ఉమా హెచ్చరించారు.