- ఒకవైపు దుమ్ము ధూళి, మరోవైపు డ్రైనేజీ నీరు
- ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మౌనం వహిస్తున్న అధికార యంత్రాంగం
- బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిహరిప్రసాద్
వేంపల్లె
అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని ప్రజలతో పాటు పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ విమర్శించారు. మంగళవారం ఆయన బిజెపి నేతలతో కలిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. అలాగే రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తూండంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దాదాపు రూ.56 కోట్లు రోడ్ల విస్తరణ, రూ. 96 కోట్లతో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. అలాగే ఒక ప్రణాళిక లేకుండా పనులు చేపట్టారని, దీంతో ప్రయాణికులు, వాహనదారులు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికార పార్టీ నేతలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు సుష్మా, చంద్ర, మహేష్ రెడ్డి, గంగాధర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.