Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅనంతం…అద్భుతం.. అమోఘం…

అనంతం…అద్భుతం.. అమోఘం…

*అనంత పద్మనాభుని బ్రహ్మోత్సవం
*అట్ట హాసంగా ఆలయ జీర్ణోద్ధరణ
*అంతా తానే అయ్యి జరిపించిన బెజవాడ ఆనీతారెడ్డి ,శ్యామ్ సుందర్ రెడ్డి…
*బ్రహ్మోత్సవాలలో మమేకమై సహరించిన గ్రామస్థులు
*కన్నులపండుగా మారిన పెంజెర్ల గ్రామం
ప్రజాభూమి ,ప్రతినిధి,హైదరాబాద్
సనాతన ధర్మాలు, అల నాటి ఆచార వ్యవహారాలు, భారతీయ సంప్రదాయం, కనుమరుగు అవుతున్న ఆచారాలను ఈ ఆధునిక సమాజంలో కొనసాగించడ మంటే కొంత మేర సాహసోపేత మైనదని చెప్పవచ్చు. పెరిగిన , పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం లో దేవాలయ సందర్శన కేవలం యాదృచ్చికంగా జరుగుతుందనేది కొంత వాస్తవం.అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆదరణ కు నోచుకోని దేవాలయం అభివృద్ధి చేసి సనాతన ధర్మాల పరిరక్షణ లో భాగంగా నడుంబిగించడం ఓ గొప్ప కార్యక్రమం.అలాంటి మహత్తర కార్యక్రమం అనితారెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం అమోఘం…అద్బుతం ..అనిర్వచనీయం. ఇంతటి గొప్ప కార్యక్రమం హైదరాబాద్ అతి సమీపంలో లోని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాలు చూస్తే… పెంజెర్ల గ్రామంలో స్వయంభువుగా వెలసిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది.మారిన పరిస్థితుల నేపద్యంలో దేవాలయము మరుగున పడి పొయింది. అలనాటి పురాతన దేవాలయమును సందర్శించి దేవుని పూజిస్తే కోరికలు నెరవేరతాయని ప్రతీకగా నిలుస్తుంది.అలాంటి దేవాలయము అనితా రెడ్డి సందర్శించి అనంతరం అనంత పద్మనాభు నికి పూర్వ వైభవం తేవాలని సంకల్పించి అనుకున్నదే తడువు గా అక్కడి గ్రామ పెద్ద,అనితా రెడ్డి వ్యాపార భాగ స్వామి మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి సహకారం తీసుకుని అభివృద్ధి కి బాటలు వేశారు.అందులో భాగంగా 3 రోజుల పాటు అనంత పద్మనాభు ని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మూడు రోజుల్లో విష్వక్షేణ పూజ ,శ్రీచక్ర పూజ ,అనంత పద్మనాభ కళ్యాణం ,స్వామి వారి ఊరేగింపు, కోలాటం, అన్నదానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ,నియోజకవర్గ zptc, ఎంపీటీసీలు ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడి గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేశారు.అనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి స్వామి మెమెంటో తో సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article