Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅనంత" జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

అనంత” జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

  • గంజాయి విక్రేతల ముఠాపై పోలీసుల ఉక్కుపాదం
  • 6.5 కిలోల గంజాయి స్వాధీనం
  • ఏడుగురిని అరెస్టు చేసిన గుంతకల్లు వన్ టౌన్ పోలీసులు
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్
  • అనంతపురము,బ్యూరో
    అనంతపురం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు గంజాయి విక్రేతల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా వేయాలన్న జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ ఆదేశాల మేరకు.. గుంతకల్లు డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో గుంతకల్లు వన్ టౌన్ సి.ఐ. రామసుబ్బయ్య ఆధ్వర్యంలో సిబ్బంది మూర్తి, లక్ష్మినారాయణ, శివ, రమేష్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా వేశారు. ఈ నేపథ్యంలో పక్కాగా అందిన సమాచారంతో గంజాయితో పాటు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో గుంతకల్లులోని షికారీ కాలనీకి చెందిన షికారి నాగు(38), షికారి మంజుల (32),కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, రచ్చమర్రి గ్రామస్తుడు నరసప్ప(49),బుక్కరాయసముద్రం మండలం, రాఘవేంద్రకాలనీకి చెందిన నిస్సార్ అహమ్మద్ (40),అనంతపురం రూరల్ మండలం, తాటిచెర్ల గ్రామస్తుడు మేకల ప్రసాద్ (43), కర్నూలు జిల్లా, కోసిగి మండలం, పల్లెపాడుకు చెందిన ఎర్రతోట లక్ష్మణ్ణ(50), అదే గ్రామానికి చెందిన పోయింటి ఈరన్న (49)లను అరెస్టు చేశారు. ఈ ముఠా కిలో గంజాయిని కొని, దానిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి గుంతకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, గుత్తి, తదితర ప్రాంతాల్లో అధిక సొమ్ముకు విక్రయించడం జరుగుతోంది. నిందితులను గుంతకల్లు షికారి కాలనీ సమీపంలోనూ, గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో పట్టుకున్నారు. గంజాయి విక్రేతల ముఠాను పట్టుకున్న సిఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article