దుక్కులకు అనుకూలించిన వాతావరణం
ప్రజాభూమి,లింగాల
ఈ ఏడాది వరుణుడు అన్నదాతను ముందే పలక రించాడు. నిశి రాత్రి వేళ నిండు వర్షం కురవడంతో దుక్కులకు వాతావరణం కూడా అనుకూలించింది. ఈ వేసవి కాలపు దిక్కులు రైతులకు బహుళ ప్రయోజనం కలిగిస్తాయి. సాధారణంగా మే 15వ తేదీ నుంచి రైతాంగం వ్యవసాయంపై దృష్టి సారిస్తుంది. అప్పుడే ఏరువాక సేద్యాలకు రైతులు ఉపక్రమిస్తారు. కానీ ఈ దఫా ముందస్తుగా పదును వర్షాలు కురిసాయి దుక్కులకు వాతావరణం అనుకూలించడంతో రైతన్నలు కూడా సంతోషంగా ఉన్నారు. ఏడాది పొడవునా సాగు చేసే పంటలకు వేసవి దుక్కులు ఎంతో ఉపయోగ పడతాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయిన అనంతరం జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రైతులు పంట విరామం పాటిస్తారు. తదుపరి సేద్యాల సమయం వచ్చేవరకు వేసవిలో ఎదురు చూస్తారు. తొలకరి లేదా ముంగారు చినుకుల ప్రభావం వేసవి కాలపు దుక్కులపై ఆధారపడి ఉంటాయి. ఉగాది పండుగ అనంతరం మొలకల పౌర్ణమి వస్తుంది. ఇక్కడి నుంచి వ్యవసాయ సీజన్ ప్రారంభమవు తుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు కూడా వ్యవసాయ పంటలకు మిక్కిలి దోహదపడతాయి. ఈ లోపు కాసిన్ని పదును వర్షాలు కురిస్తే రైతులు దుక్కుల వైపు మొగ్గు చూపుతారు. వీటినే ఏరువా క సేద్యాలు అని కూడా పిలుస్తారు. సేద్యాలు పూర్తి చేసుకున్న అనంతరం రుతుపవనాల వాతావరణ వల్ల వచ్చే పదును వర్షాలు ఖరీఫ్ సీజన్లో సాగించే పంటలకు ఉపయోగపడతాయి. భూమి ఉగ్గు రేగిన తర్వాత సేద్యాలకు ఉపక్రమించడం ఉంటుం దని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. భూమికి ఏటవాలుగా సేద్యం చేయాలి దీనివల్ల భూమి లోపల దాగి ఉండే క్రిములు కీటకాలు తీవ్రమైన ఎండలకు నశిస్తాయి. దీనివల్ల కలుపు నివారణ సమస్య తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా దుక్కుల ను లోతుగా చేయాలి దీనివల్ల వర్షా బావ పరిస్థితి లో సాగులో ఉన్న పంటలకు కాస్త ఉపశమ నం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. చేలకు మట్టి చేరవేసిన తరువాత పదును వర్షాలు వస్తే వివిధ రకాల పండించుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా రసాయనిక ఎరువుల వినియోగానికి స్వస్తి కలిగి పకృతి వ్యవసాయపు మగ్గు చూపాలని అలాగే సేంద్రియ ఎరువులను వాడటం వల్ల అటు భూమి సారవంతంగా ఉండడం తో పాటు నాణ్యమైన దిగుబడి చేతికందే అవకాశం ఉందని