Sunday, April 20, 2025

Creating liberating content

రాజకీయాలుఅన్నివర్గాల ప్రజలను ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం

అన్నివర్గాల ప్రజలను ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం

జగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షం

ప్రజాభూమి పులివెందుల టౌన్
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని జగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని 20వ వార్డు కౌన్సిలర్ పన్నతోట శ్యామలాదేవి, జే సి ఎస్ ఇంచార్జ్ చంద్రమౌళిలు అన్నారు. సోమవారం పట్టణంలోని శేషారెడ్డి స్కూలు సమీపంలో ని బేతేలు చర్చి తదితర ప్రాంతాలలో జగనన్న మా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే చేర్చారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం చేశారని వారు అన్నారు. పేద ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదని వారన్నారు . రాష్ట్రంలో వైకాపా పార్టీకి ప్రజల ఆదరణ లభిస్తుందని దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం నాయకులు వైకాపా పార్టీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2024 ఎలక్షన్లలో వైకాపా పార్టీని అఖండ మెజార్టీతో ప్రజలేగెలిపిస్తారని వారన్నారు . ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పన్నతోట నరసారెడ్డి, సచివాలయ కన్వీనర్ ప్రదీప్ కుమార్ రెడ్డి, వాలంటరీ హేమలత, గృహసారథి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article