గాజువాక:
జీవీఎంసీ 87 వార్డులో 2 కోట్ల34 లక్షల 2 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని కణితి కాలింగ వీధి 19.92 లక్షల రూపాయలతో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్రంథాలయం నిర్మాణం కొరకు మరియు కణితి కాలింగ వీధి పార్కులో 18.9 లక్ష రూపాయలతో ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ మరియు వడ్లపూడి ప్రధాన కాలువ నిర్మాణం కొరకు అప్పికొండ కాపు ఏరియా లో 1 కోటి 95 లక్షల రూపాయలతో నిర్మాణం పనులను చేయుటుగాను ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగాయి.స్థానిక వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన రహదారి గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రజల వద్ద పలు సమస్యలపై వినతి పత్రాలు తీసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడారు ఆ సమస్యలను ప్రధాన రహదారిని ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేస్తానే హామీ ఇచ్చారు అలాగే మిగిలిన వాటిని పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు వరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గాజువాక నియోజకవర్గం ను మోడల్ సిటీగా తయారు చేయడం తన లక్షము అని అలాగే 87 వార్డులో త్వరలోనే వడ్లపూడి మెయిన్ రోడ్డు నుండి గాంధీ బొమ్మ వరకు ఉన్న ప్రధాన రహదారి త్వరలోనే పనులకు శంకుస్థాపన జరుగుతాయని ఆయన అన్నారు. జీవీఎంసీ చేపట్టిన పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో… వార్డ్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కోమటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొడ్డ గోవిందా ,జిల్లా కార్యదర్శి ప్రగడవేణుబాబు, వార్డు కార్యదర్శి ముద్దపు దామోదర్, బీసీ సెల్ కార్యదర్శి జిల్లా మరియు సచివాలయం కన్వీనర్ దుగ్గపు దానప్పలు, మార్పు శేషు, ఎన్నేటి రమణ,సిహెచ్ వి రమణ,బోండా గోవిందరాజులు,ప్రగడ శ్రీనివాస్, ఎస్ పాపారావు, ప్రగడ శంకర్రావు,ఆడారి శ్రీను, కోమటి రమాదేవి, వడ్లపూడి ఈశ్వరరావు, గోనప సన్యాసినాయుడు,జ్ ఈశ్వరరావు, కె.వి నారాయణ, బొడ్డ సన్యాసిరావు, హరీష్ వర్మ,ప్రగడ రాము,మల్ల అప్పనమ్మ, జీవీఎంసీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, కళింగ యూత్ సభ్యులు,అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు