Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅభివృద్ధి సంక్షేమమే జగనన్న ధ్యేయం

అభివృద్ధి సంక్షేమమే జగనన్న ధ్యేయం

  • కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

వేంపల్లె
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో రూ. 9.60 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి, బైపాస్ రోడ్డు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ లను పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మాజీ డిసిసి బ్యాంకు చైర్మన్ తిరుపాల్ రెడ్డిలతో కలిసి ఎంపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎంపీటీసీ చంద్రఓబుల్ రెడ్డి తనసొంత స్థలంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఆ గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి పూలమాలలతో ఎంపి అవినాష్ రెడ్డిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కు మాత్రమే దక్కిందన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పాలనను బ్రష్టు పట్టించారని… ప్రస్తుతం టిడిపి నేతలు వాలంటీర్ల వ్యవస్థపై లేని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలాన్ని అర్హులైన పేదలందరికీ అందాలనే సదాశయంతో సీఎం జగనన్న వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక పోతున్నారని.. టిడిపి నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారన్నారు. గత టిడిపి హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలేక, దిగుబడి రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ.. వారికి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర వాటిని కల్పిస్తోందన్నారు. అనంతరం ఆ గ్రామంలోని సమస్యలపై ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఎమ్. రవికుమార్ రెడ్డి, వైకాపా మండల కన్వీనర్లు కె.చంద్ర ఓబుల్ రెడ్డి, సాంబశివారెడ్డి, రఘునాథ్ రెడ్డి, జేసిఎస్ మండల కన్వీనర్ ఆర్.శ్రీనివాసులు, వేంపల్లె ఎంపిపి ఎన్. లక్ష్మిగాయిత్రీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు యల్లారెడ్డి, సర్పంచులు రాంప్రసాద్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయరెడ్డి, ఆర్ఎల్వీ ప్రసాద్ రెడ్డి, కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి, ఆర్&బి ఇఇ సిద్ధారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు వేల్పుల రామలింగేశ్వరరెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఓబుల్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు తదితర ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article