Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅమర రాజా డిప్లొమా కోర్సు 8వ బ్యాచ్ ప్రారంభోత్సవం

అమర రాజా డిప్లొమా కోర్సు 8వ బ్యాచ్ ప్రారంభోత్సవం

తిరుపతి

ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట లోని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో అమర రాజా డిప్లొమా కోర్స్ 8వ బ్యాచ్ ద్వారా 50 మంది ఉద్యోగులకి అమర రాజా డిప్లొమా కోర్సు నీ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ కంపనీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, సి .నరసింహులు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కోర్సు లో 02 సంవత్సరాలు వ్యవధితో నాలుగు సెమిస్టర్లు మరియు 04 సబ్జెక్ట్స్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్)గా ఉంటాది . ఇందులో ఉత్తీర్ణత పొందిన ఉద్యోగులకి అమర రాజా కంపనీ లోనే సూపర్వైజర్స్ గా పదోన్నతి ఇవ్వటం జరుగుతుంది.

అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ కంపనీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, సి .నరసింహులు నాయుడు ముఖ్య అతిథి మాట్లాడుతూ, “అమరా రాజ లో పనిచేసి ప్రతి ఒక్క ఉత్తమ ఉద్యోగులను ఉత్తమ అవకాశాలు కల్పించే లక్ష్యంతో, ఈ అమర్ రాజా డిప్లమా కోర్స్ ని ప్రారంభించడం జరిగింది, ఇందులో ఇప్పటివరకు ఉత్తీర్ణులై పదోన్నతి పొందిన ఉద్యోగులకు మరియు కోర్స్ నీ ప్రారంభిస్తున్న ఉద్యోగులకి అభినందనలు తెలియజేశారు మరియు ఈ కోర్సు ద్వారా ప్రతి ఉద్యోగస్తుడు వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఇంకా పురోగతి సాధించాలని అన్నారు.

 అమర రాజా కంపెనీలో పనిచేసే ఉత్తమ ఉద్యోగుల పదోన్నతులలో పురోగతులు ప్రోత్సహించే లక్ష్యంతో మిషన్ ఆపరేటర్ గా పనిచేసే ఉత్తమ ఉద్యోగులను సూపర్‌వైజర్ గా పదోన్నతి కి ప్రోత్సహించే  ప్రోగ్రామ్ అమర రాజా డిప్లొమా కోర్సు ని  2015 ఆగస్టు నెలలో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకు 110 మంది ఉద్యోగులు 6 బ్యాచ్‌లు గా తమ కోర్సును పూర్తి చేసి సూపర్‌వైజర్ గ్రేడ్‌లోకి పదోన్నతి పొందారు. తదుపరి 07వ బ్యాచ్ ఉద్యోగులు 50 మంది కోర్సు పురోగతిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమర రాజా కంపెనీ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ నళిని కుమార్, రాజన్న ఫౌండేషన్ జనరల్ మేనేజర్ సతీష్, మంగల్ ఇండస్ట్రీస్ బిజినెస్ హెచ్ఆర్ మేనేజర్ రవికుమార్, అమర రాజ ఇన్ఫ్రా బిజినెస్ హెచ్ఆర్ మేనేజర్ సునీల్ వర్మ, అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డీన్ రవికుమార్, అమర రాజా ఉద్యోగులు,స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article