కడప ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి సిబిఐకి చేసుకున్న అభ్యర్థనను వారు మానవతా దృక్పధంతో అర్థం చేసుకోని, సహకరించాలని ఆయన అభిమానులు కర్నూల్లోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద బ్యానర్లు చేతపట్టి సంఘీభావం ప్రకటించారు.
తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి గారి తల్లి శ్రీమతి వైయస్ లక్ష్మి గారు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా తన తల్లి వద్దే ఉంటూ స్వయంగా బాగోగులు చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అభిమాననులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, కడప, పులివెందుల తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కర్నూల్ చేరుకొని ఎంపీ గారి తల్లి ఆరోగ్యం కుదుటపడాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఒక వైపు తల్లి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర మనోవేదనలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేస్తుందన్న ఒకవర్గం మీడియా కథనాలతో ఆందోళన చెందిన వైఎస్ కుటుంబ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై ఆయనకు సంఘీభావంగా మేమున్నాం అంటూ ఆసుపత్రి వద్దకు చేరుకొని ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా కన్న కొడుకుకు తల్లి పట్ల ఉండే ప్రేమ, బాధ్యతల నేపథ్యంలో సిబిఐ విచారణకు కొంత గడువుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని సిబిఐ అధికారులు మానవతా దృక్పధంతో స్వీకరించి, సహకరించాలని ఎంపీ అవినాష్ రెడ్డి అభిమానులు, వైసిపి శ్రేణులు, ప్రజలు ఫ్లకార్డులు చేతపట్టి సిబిఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు.