Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంఅలరించిన నృత్య ప్రదర్శనలు

అలరించిన నృత్య ప్రదర్శనలు

పులివెందుల
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృ తిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో ప్రాంగణమంతా సందడిగా మారింది.రౌడీ మోమో కేఫ్ మరియు సిరి సంజీవని,ది మిల్లెట్స్ కేఫ్ వారి సౌజన్యంతో మాస్ట ర్ యు వకిషోర్, యువరాజ డ్యాన్సింగ్ స్కూల్, పులివెందుల వారు సమ్మర్ క్యాంప్ ముగింపు వేడు కలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర మాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహా గణపతిం మనసా స్మరామి అంటూ సాగే ఈ పాటతో మొదలై నా అందం చూడు బావయ్యో (జనపదం),అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలి తే.,సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ, కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, నా కళ్ళు చెపుతు న్నాయి నిను ప్రేమించానని తదితెర పాటలకు కళాకారులు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ప్రేక్షకు ల చిన్నారులను కరతాళ ధ్వనులతో ప్రోత్సహించి అభినందించారు. కార్యక్రమం ఏర్పాట్లను శిల్పారా మం ఏఓ సుధాకర్ పర్యవేక్షించారు.ఈ కార్యక్రమం లో నృత్య శిక్షకుడు ప్రకాష్ (సిరిసంజీవని) ,ప్రియత మ(రౌడీ మోమో కేఫ్), స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article