శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణం చేశారు. భద్రతా సిబ్బంది ఆయనను మరో ఆటోలో అనుసరించారు. కేటీఆర్ సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన ఆటో కార్మికుల ఇబ్బందులపై స్పందించారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం మంచిదేనని.. కానీ పథకాలు ప్రవేశపెట్టే సమయంలో అన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన పథకం మంచిదే అయినప్పటికీ దీని వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పథకం పెడితే అనాలోచితంగా పెట్టవద్దని సూచించారు.