వాళ్లకు అవకాశాలు కల్పిస్తే పురుషులతో సమానంగా రాణిస్తారు:మండల వైద్యాధికారిణి జె. కల్పనా రాణి
నరసాపురం:స్థానిక విజన్ యు.పి స్కూల్ నందు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మరియు అమ్మకు వందనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల వైద్యాధికారిణి జె. కల్పనా రాణి మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని అన్నారు. వాళ్లకు అవకాశాలు కల్పిస్తే పురుషులతో సమానంగా రాణించగలరని అన్నారు. ఏ సమాజంలో అయితే స్త్రీలకు, పురుషులకు సమాన హక్కులు ఉంటాయో ఆ సమాజంలో నిజమైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఆడపిల్లలు చాలా జాగ్రత్త వహించాలని అన్నారు. ఆడపిల్లల భ్రూణ హత్యలు, వరకట్నం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు రూపుమాపాలని అన్నారు. మదర్ థెరిసా, మేడం క్యూరీ, సావిత్రి బాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన మహిళలను ఆడపిల్లలందరూ ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురం. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లల సాధికారిత సాధిఛాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని అన్నారు. ఒక స్త్రీకి విద్యను అందిస్తే, సమాజం మొత్తానికి విద్యను అందించినట్లు అవుతుందని అన్నారు. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారని అన్నారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన .ఆడపిల్లల చదువు – ఉపయోగాలు.అనే అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అతిథులచేఅందజేయబడ్డాఈకార్యక్రమంలోఉపాధ్యాయినిలు విజయలక్ష్మి, వరలక్ష్మి, అరుణ, మహాలక్ష్మి, పుష్పవతి, ఏస్తరు రాణి, మధులత,రమ్య శ్రీ, మౌనిక, రాజేశ్వరి, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.