కదిరి:కదిరి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన మూడు కుటుంబాల వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బుల్ అహ్మద్ శుక్రవారం ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున రూ. 30 వేలు ఆర్థికసాయాన్ని ఆ వార్డు యువ నాయకులు సమీర్ ఖాన్ చేతులు మీదుగా అందజేశారు. తమ అనారోగ్య పరిస్థితిని గుర్తించి ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ కు, యువ నాయకులు సమీర్ ఖాన్ లకు ఆయా కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కటిక సంఘ యువ నాయకులు ఇబ్రహీం, సనావుల్లా, జుబైర్, బాబాజాన్, తాజుద్దీన్, షాకీర్ తదితరులు పాల్గున్నారు.