యూనియన్ నాయకురాలు యు.లక్ష్మీదేవి డిమాండ్
హనుమంతునిపాడు
ఆశ వర్కర్స్ కు ప్రభుత్వ హామీ మేరకు కనీస వేతనాలు పెంచాలని యూనియన్ నాయకురాలు యు. లక్ష్మీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హనుమంతుడుపాడు మండలం ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ సందీప్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యు.లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు చేత సంబంధం లేని పనులు చేయించరాదని ప్రభుత్వ సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు ఆశా కార్యకర్తలు అమలు చేయాలని ఆశ నియామకంలో రాజకీయం జోక్యం లేకుండా ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా నియమించాలని మెడికల్ లీవులు వేతనంతో కూడిన మెటర్నరీ లీవులు అమలు చేయాలని 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మట్టి ఖర్చులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు జీవోను వర్తింప చేయాలని రిటైర్మెంట్ అయిన వారు మరణించిన వారి కుటుంబాలలో అర్హులైన వారిని ఆశలుగా నియమించాలని కోరినారు. కోవిడ్ కాలంలో 2020 మార్చి నుండి మరణించిన ఆశా కార్యకర్తలకు 10 లక్షల ఎక్స్ప్రెషన్ చెల్లించాలని ఏఎన్ఎం ట్రైనింగు ఇవ్వాలని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని జిఎన్ఎమ్ ట్రైనింగ్ పొందిన ఆశా కార్యకర్తలను ఏఎన్ఎంలుగా నియమించాలని హెల్త్ సెక్రటరీ స్టాఫ్ నర్స్ లో నియమాకాలలో ఆశలకు వెయిటేజ్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ చాముండేశ్వరి బాల చెన్నమ్మ సుభాషిని రజిని ప్రమీల రవణమ్మ ప్రశాంతి అన్నమ్మ గురవమ్మ చిన్నమ్మి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.