ప్రజాభూమి, తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు. తాజాగా తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు ఈ వేడుకలను కన్నులపండువగా సాగనుంది. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.అంజనాద్రి, ఆకాశ గంగ, నాద నీరాజనం వంటి వేదికలపై ప్రతిరోజు అన్నమాచార్య, దాససాహిత్య కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలను జరుపనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రాజెక్టు ఆధ్వర్యలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయనున్నారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత యూనవర్శిటీ, శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేదపండితులతో ఆయా కార్యక్రమాలు రూపొందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఆయా కార్యక్రమాలన్నింటినీ శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుచర్యలు తీసుకోనున్నారు. క్యూలైన్లల్లో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీళ్లు అందించనున్నారు. హనుమాన్ జయంతి ఏర్పాట్లపై టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారిణి సదా భార్గవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈ భేటీ ఏర్పాటైంది. టీటీడీకి చెందిన అన్ని విభాగాల అధికారులఇ ఇందులో పాల్గొన్నారు. వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయాల ఉప కులపతులు రాణిసదాశివమూర్తి, కృష్ణమూర్తి దీనికి హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుచర్యలు తీసుకోనున్నారు. క్యూలైన్లల్లో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీళ్లు అందించనున్నారు.