Friday, November 29, 2024

Creating liberating content

రాజకీయాలుఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు: పవన్ కల్యాణ్

ఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు: పవన్ కల్యాణ్

తణుకు :తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. స్థానికంగా ఉన్న పౌరసరఫరాల మంత్రి పేరును కూడా నా నోటి నుంచి పలకడానికి ఇష్టపడను అంటూ పవన్ ధ్వజమెత్తారు. ఇక్కడ టీడీఆర్ బాండ్ల సొమ్ము దోచుకుని హైదరాబాద్ వెళ్లి బాలానగర్ లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆ మంత్రి కనీసం తన అవినీతి సొమ్మును ఈ నియోజకవర్గంలో పెట్టు బడి పెట్టినా స్థానికులకు ఉపాధి వచ్చేదని అన్నారు. గతంలో ఇక్కడ జరిగిన తప్పులపై జనసేన రోడ్లపైకి వచ్చి పోరాడిందని పవన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చి పోలేదు అని అన్నారు. ఇక, అందరూ పేదల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటారని, కానీ మధ్య తరగతి వ్యక్తుల గురించి ఎవరూ మాట్లాడరని పవన్ పేర్కొన్నారు. అందుకే ఈ సభా ముఖంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని, మధ్యతరగతి ప్రజలను కూడా గుర్తించాలని కోరుతున్నానని తెలిపారు. ఏపీలో 10 పాయింట్స్ ఫార్ములాతో ప్రజల్లోకి వస్తున్నామని… చిట్టచివరి పొలానికి కూడా నీరందాలి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనేదే తమ లక్ష్యమని ఉ టిం చారు. సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఎంత క్లిష్టమైన అంశం అయినప్పటికీ, అసెంబ్లీకి రాగానే దానిపై మాట్లాడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే సీపీఎస్ ను పరిష్కరించాలని ఈ సందర్భంగా కూటమి భాగస్వాములకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
పోలవరం అయిందా అని అడిగితే… ఆ మంత్రి డ్యాన్సులు చేస్తాడు: తణుకులో పవన్ కల్యాణ్
నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు… నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు… ఇది రాసింది మన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తణుకు ప్రజాగళం సభలో ప్రసంగం ప్రారంభించారు.
బాపు వంటి ఒక గొప్పచిత్రకారుడు కూడా తణుకులో పుట్టారని వెల్లడించారు. నన్నయ ఇక్కడే యజ్ఞయాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేల ఇది… ఇస్రో రాకెట్లకు ఇంధనం అందిస్తున్న నేల ఇది… ఎంతో పురోభివృద్ధి ఉన్న నేల ఇది… అలాంటి నేల వైసీపీ పాలనలో కరప్షన్ క్యాపిటల్ గా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నారని, ఓ రైతు ధాన్యం తడిసిపోయిందని అడిగితే, ఆ మంత్రి ఎంతో ఛీత్కారంగా మాట్లాడారని పవన్ ఆరోపించారు. ఈ ఎన్నికలతో ఆ మంత్రి సర్వం తుడిచిపెట్టుకుపోవాలని అన్నారు. “పదేళ్లుగా నేను పార్టీ పెట్టి యువత భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను. మరోవైపు, 2047 నాటికి దేశం భవిష్యత్ ఇలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. ఇక, బలమైన నాయకుడు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 90వ దశకం చివర్లో విజన్ 2020 పేరిట ఒక సైబరాబాద్ పేరిట ఐటీ సిటీని రూపుదిద్దిన వ్యక్తి చంద్రబాబు. ఇవాళ చప్పట్లు కొట్టించుకోవడానికి ఇక్కడికి రాలేదు… మీకోసం మేం ఉన్నాం అని చెప్పడానికి వచ్చాం… మీ కోసం మేమెంతో తగ్గాం. చంద్రబాబు గారు ఎంతో తగ్గారు.. నేను కూడా తగ్గాను. ముఖ్యంగా జనసేన పార్టీ ఎంతో తగ్గింది. తణుకులో జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా మేం తగ్గాల్సి వచ్చింది… ఓటు చీలకూడదన్నదే ప్రధాన కారణం. మా అన్నయ్య నాగబాబు అనకాపల్లి సీటును కూడా వదులుకున్నారు… ఇదంతా ఆడబిడ్డల భద్రత కోసం, రైతన్నల క్షేమం కోసం, కనీస వైద్య సదుపాయాల కోసం. దోపిడీ మీద దృష్టి ఉన్న వాడు ప్రజావసరాల గురించి ఏం పట్టించుకుంటాడు? చంద్రబాబుతో, ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించి ఈ కూటమిని తీసుకువచ్చాం. నాకు అధికారం లేకపోయినా, చంద్రబాబుకు అధికారం లేకపోయినా మాకు నష్టం లేదు. కానీ జగన్ ఐదేళ్ల పాటు డీఎస్పీ ఇవ్వలేదు. అలాంటి పాలకులు అధికారంలో ఉంటే ఎవరికీ భవిష్యత్ ఉండదు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article