పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చాలా మంది నీరును తక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. అయితే నీటికి బదులుగా కొన్ని జ్యూసులను తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. దీని కోసం మనం ఇంట్లో లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వేడి నీళ్ళు: వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. అయితే నిమ్మకాయ, ఆరెంజ్, పుదీనా, అల్లం, దోసకాయ ముక్కలును గోరువెచ్చని నీళ్ళులో వడపోసుకొని తేనెను కలిపి తీసుకోవడం వల్ల డిటాక్సిఫైయర్‌గా ఉపయోగపడుతుంది.
పసుపు పాలు:కప్పు పాలు, చిటికెడు పసుపు పొడి, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,అల్లం తీసుకోవాలి. శీతాకాలంలో ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సూప్:సూప్‌ను చిలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. నల్ల మిరియాలతో జోడించడం చాలా సహాయపడుతుంది.
హెర్బల్ టీ: పుదీనా, గ్రీన్ టీ ఆకులు, చమోమిలే, అల్లం, నిమ్మ వంటి హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల ఒమేగా- 3 ఎఫ్ ఎఫ్ ఎ లభిస్తుంది.
ఆరెంజ్, పైనాపిల్, యాపిల్ లను జ్యూస్ చేసి తీసుకోవాలి. తరువాత ఒక సాస్పాన్‌లో వేడి చేసి దాల్చిన చెక్క,జాజికాయ,దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. ఇరువై నిమిషాలు పాటు వేడి చేసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.