రేణిగుంట
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు అభయ ఫౌండేషన్ సహకారంతో ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కార్ డ్రైవింగ్ కి సంబంధించి కరపత్రాలను ఏవో హరిబాబు సార్ ఆవిష్కరించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు స్వయం ఉపాధిగా డ్రైవింగ్ వృత్తినే జీవనోపాధి గా రాణించాలి అనే కోరిక కలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆకాంక్ష సంస్థ డాక్టర్ రవిబాబు ఇలాంటి ఇంకా ఎన్నో జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్ రవిబాబు ఈ కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసినారు. అనంతరం ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్ధాల రవిబాబు మాట్లాడుతూ అభయ ఫౌండేషన్ ఫౌండర్ సుంక బాలచంద్ర స్వామీజీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు చదువు సంస్కారం స్వయం ఉపాధి మరియు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని అందులో భాగంగా మనకు మొదటగా నిరుపేదలకు డ్రైవింగ్ నేర్పమని ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థకు అవకాశం కల్పించడం జరిగినదనీ అందుకు మీడియా ముఖంగా స్వామీజీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపినారు ఈ ఉచిత డ్రైవింగ్ శిక్షణకు పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద యువకులు ఫిబ్రవరి 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులు ఎంపీడీవో ఆఫీస్ నందు మరియు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆఫీస్ పని వేళలలో ఇవ్వబడును మిగతా సమాచారం కోసం క్రింది మొబైల్ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోగలరు 8790457813, 9642847693