-పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన స్నేహ హస్తం
కనిగిరి :కనిగిరి కి చెందిన స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధీర్ బాబు, సభ్యులు కనిగిరి ఏపీ మోడల్ స్కూల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్ ను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వివి రమణయ్య, ఎస్ఎంసి చైర్మన్ గోపిశెట్టి బాల చెన్నారావులు మాట్లాడుతూ స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులోనూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం అభినందనీయమన్నారు. స్నేహ హస్తం చిరుకానుకను అందుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉన్నత స్థానాలను అలంకరించాలని సూచించారు. స్నేహ హస్తం సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాగుణాన్ని చిన్నతనం నుంచి అలవర్చుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసి ఆదుకునేలా అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కష్టపడి చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సొంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబును ప్రిన్సిపల్ వివి రమణయ్య, ఎస్ఎంసి చైర్మన్ గోపిశెట్టి బాల చెన్నారావులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆర్ కిషోర్, ఉపాధ్యాయులు కే రత్నరాజు, ఎంవి నారాయణ, సిహెచ్ వెంకటేశ్వర్లు, పి రమేష్, వై వకులాదేవి, ఎం రుక్సానా, పి రమ్య గీతా, యు అనిత,టి సిహెచ్ స్రవంతి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రత్నం, ఓబులు, రఫీ, సాయిరాం, పద్మజారాణి, కోటిరత్నం స్నేహ హస్తం సభ్యులు అక్బర్ వలీ, వెంకటేశ్వర్లు, భాస్కర్, బేబీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.