చంద్రగిరి
చంద్రగిరి మండలం ఏ. రంగంపేట లో మోహన్ బాబు యూనివర్సిటీ దాసరి ఆడిటోరియంలో మూడు రోజులపాటు రీసెర్చ్ మెథడాలజీ మరియు పబ్లికేషన్ ఎథిక్స్ పై వర్క్ షాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా సింగపూర్ లోని నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ( ఎన్ టి యు) ఆచార్యులు డాక్టర్ నరసింహన్ సుందర్ రాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగాపరిశోధక విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ రీసెర్చ్ అనేది ఒక మహా యజ్ఞమని అది రోజంతా పట్టుదలతో దీక్షతో కృషితో సాధన చేస్తే గానీ కొన్ని సం”లకు సిద్ధిస్తుందని తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మైసూర్ జె ఎస్ ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ డాక్టర్ బి.ఎస్ ఆనంద్ పరిశోధక విద్యార్థులనుద్దేశించి పట్టుదలతో శ్రమించి పరిశోధన చేస్తే గాని పరిశోధక విద్యార్థి తన మేధస్సును పెంపొందించుకో లేడని తెలిపారు. అనంతరం యం బి యు వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజ రామారావు మాట్లాడుతూ పరిశోధన అనేది ఈరోజు ప్రపంచానికి ఆవశ్యకత ఎంతో ఉందని పరిశోధనలోనే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని తద్వారా ప్రపంచం పురోభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఎం బి యు రిజిస్టార్ డాక్టర్ కే .సారధి మాట్లాడుతూ ఎంబీయూలో చేరిన ప్రతి పరిశోధక విద్యార్థి వినూత్న పద్ధతిలో పరిశోధన చేసి తమకంటూ ప్రత్యేకత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాదాపు 200 మంది, ఎంబీయూ పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబియూలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వింగ్ ఆధ్వర్యంలో డీన్ ఆచార్య అవిరేని శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసెర్చ్ డాక్టర్ ఈశ్వరయ్య ,ఇతర డీనులు, ఆచార్యులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.