న్యూఢీల్లీ
భార్యాభర్తల మధ్య విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యభర్తల ఇద్దరికి ఇష్టమైతే విడాకులు తీసుకోవచ్చని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.విడాకులు కోరుకునే దంపతులు హిందూ వివాహ చట్టం -1955 ప్రకారం ఆరు నెలలు దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు. చక్కదిద్దలేనంతగా దంపతుల మధ్య విబేధాలు ఉంటే.. వారిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోవాలని భావిస్తే ఆ వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేషాధికారం ఉందని కోర్టు క్లారిటీ ఇచ్చింది.కుటుంబ న్యాయస్థానాలకు పంపించకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరుచేసే అంశంపై పలు పిటీషన్లు దాఖలయ్యాయి. 2016లో ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 2022 సెప్టెంబర్ నెలలో తీర్పును రిజర్వు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ కౌల్‌తో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జే.కె. మహేశ్వరి ఉన్నారు.సుప్రీంకోర్టు తాజా తీర్పు సంగతి అలా ఉంచితే.. ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారత్దేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఇండియాలో ప్రపంచంలోకెల్లా అతి తక్కువ విడాకుల కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రతీ వెయ్యి వివాహాల్లో 13వివాహాలు పెటాకులవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. అంటే భారతదేశంలో విడాకులు తీసుకుంటున్నవారు ఒక శాతం మాత్రమేనట.అయితే ఎక్కువ శాతం జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లక్సేంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 87శాతం మంది పెళ్లి తరువాత విడాకులు తీసుకుంటున్నారు. ఆ తరువాతి స్థానంలో స్పెయిన్ 67శాతం, ఫ్రాన్స్ 55శాతం, రష్యా 51 శాతం, అమెరికా 46 శాతం జంటలు డివోర్స్ తీసుకుంటున్నారు. తక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియాలో కేవలం వన్ పర్సంటేజ్ కపుల్స్ మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. చిలీ దేశంలో మూడు శాతం, కొలంబియాలో 9శాతం, మెక్సికో, కెనన్యా దేశాల్లో 15 శాతం మంది జంటలు విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.