15 నుండి ఎన్నికల ప్రచారం …
ప్రొద్దుటూరు
రాష్ట్రంలో 60 రోజులలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు వైసిపి శ్రేణులు తనతో పాటు సిద్ధం కావాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదివారం కొర్రపాడు రోడ్డు లోని మైదానంలో నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు మరియు వాలంటీర్లతో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈనెల 15న ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి ఎన్నికల ప్రచారం చేపడుతున్నామని తనతోపాటు వైసీపీ శ్రేణులు కథని తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రెండు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించి అఖండ మెజారిటీతో గెలుపును సాధించేలా కృషి చేయాలన్నారు. అబద్దాలతో ప్రచారం చేస్తున్న వైవి పక్షాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. 25 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తిరిగి మోసం చేయడానికి మాజీ ఎమ్మెల్యే వరద ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాలు పరిస్థితులను ఎదుర్కొందన్నారు మిగిలిన మూడు సంవత్సరాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు అంతేకాకుండా పురపాలక సంఘ పరిధిలో 120 కోట్లతో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన వైనాన్ని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. నిత్యం వైసిపి పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. సమావేశంలో పాల్గొన్న వైసీపీ శ్రేణులతో ఎన్నికల సమర శంఖారావానికి సిద్ధం అని నినాదాలు పలికించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు కాకర్ల నాగశేషారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్ ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ జడ్పీ వైస్ చైర్మన్ జ్యేష్టాది శారద వైసిపి మండల కన్వీనర్లు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.