Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలి

ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలి

ఎన్నికల వ్యయాన్ని పక్కాగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప బ్యూరో:రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని పాటించడంతో పాటు ఎన్నికల వ్యయాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో త్వరలో జరగనున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్యులు ఎన్నికల వ్యయం పై నిర్వహించే రికార్డులు, అక్కౌంట్స్, ఎంసీసీ, ఎంసీఎంసి, సువిధ, సి-విజిల్ లాంటి వివిధ ఐటి అప్లికేషన్స్ పై రాజకీయపార్టీల ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ తో పాటు జేసి గణేష్ కుమార్, నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, డిఆర్వో గంగాధర్ గౌడ్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు ఎంపీ కు పోటీ చేయు అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే కు రూ.40 లక్షల ఖర్చు మించరాదు అన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే రోజు కంటే ముందుగానే సెపరేట్ గా ఒక బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలన్నారు. నామినేషన్ వేసిన రోజు నుండి డేట్ ఆఫ్ డిక్లరేషన్ వరకు తన ఎన్నికల ఖర్చును సంబంధిత రిజిష్టర్ నందు నమోదు చేసి నిర్ణీత సమయంలో వ్యయ అధికారులకు చూపించాలన్నారు. ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఖర్చు పై షాడో రిజిస్టర్లను నిర్వహిస్తుంటారని తెలిపారు.
అభ్యర్థి తన నామినేషన్ పత్రాలను క్షున్నంగా చదివి జాగ్రత్తగా పూరించాలన్నారు. ప్రచారానికి స్టార్ క్యాంపెనర్లు వచ్చేటట్లు ఉంటే ముందుగానే సీఈఓ నుండి అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుండి అభ్యర్థి ప్రచారానికి అవసరమైన అనుమతులను సువిధ యాప్ లో అప్లోడ్ చేసి అనుమతులను పొందాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను చేయాలనుకుంటే సి-విజిల్ యాప్ ద్వారా చేయాలన్నారు. అభ్యర్థులు తమ సోషల్ మీడియా ఐడి లను ఇవ్వాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే అభ్యర్థులు సంబంధిత ప్రకటనలపై మూడు రోజుల ముందుగానే ఎంసీఎంసి (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు. వార్తా పత్రికలలో వచ్చే అభ్యర్థుల ప్రకటనలు, చెల్లిపు వార్తలను ఎన్నికల నియమావళి మేరకు ఎంసీఎంసి పరిశీలించి రేట్ కార్డ్ ఆధారంగా ఖర్చు లెక్కించి అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఖాతాకు జమచేసేందుకు సంబంధిత ఆర్వోలకు పంపిబడుతుందన్నారు.
ఇతర నేతలను విమర్శించే ప్రకటనలు, కుల, మత పరంగా దాడులను ప్రోత్సహించే ప్రకటనలు, అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించేవిధంగా, హింసను ప్రేరేపించే విధంగా, న్యాయ వ్యవస్థ ధిక్కారం క్రింద వచ్చే విషయాలు, తదితర అంశాల ప్రకటనలను చేయరాదన్నారు. అలాగే దేవాలయాలు, మసీదులు,చర్చీలు, గురుద్వారాలు.. ఇతర ప్రార్థనా స్థలాలు, మతపర సూక్తుల గుర్తులు, ఫోటోలు, నినాదాలు, పోస్టర్లు తదితరాలను తమ రాజకీయ ప్రకటనలందు ఉపయోగించరాదని, అలాగే అక్కడ ఎలాంటి ప్రచారం చేయరాదన్నారు. కుల,మత పరంగా ఓట్లు అడగరాదన్నారు. రానున్న ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు మనమందరం కృషి చేద్దాం అన్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు క్షున్నంగా హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఎంసీసీ నోడల్ అధికారి నందన్, జిల్లా మాస్టర్ ట్రైనర్లు మెప్మా పిడి సురేష్ రెడ్డి, డివిజినల్ కోపరేటివ్ అధికారి శివప్రసాద్, ఎంసీఎంసి మెంబెర్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, సభ్యులు గుర్రప్ప తో పాటు రాజకీయ పార్టీలనుండి… వైసిపి నుండి హరి, సునీల్, కోదండరాం, జోహార్, వంశీ, కరుణాకర్ రెడ్డి, నాగార్జున, సుధీర్, టిడిపి నుండి వాసు,హరి ప్రసాద్, బీజేపీ నుండి లక్ష్మణ రావు,రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ నుండి ప్రసాద్, బీఎస్పీ నుండి దానం,గుర్రప్ప, సీపీఎం నుండి చంద్ర శేఖర్,మనోహర్, ఆప్ నుండి శ్రీనివాసులు, తిరుమల రెడ్డి, తదితరులు, వారి వారి పార్టీల నుండి ఐటీ టీమ్స్, తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article