ప్రోటోకాల్ పాటించరు
జడ్పిటిసి వసంతరావు
ప్రజా భూమి, జీలుగుమిల్లి
ఏజెన్సీ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు అంటే అధికారులకు చులకనగా ఉందని ప్రోటోకాల్ పాటించడం లేదని జీలుగుమిల్లి జెడ్పిటిసి మల్లం వసంతరావు నిప్పులు చేరిగారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క అధికారి కూడా విధులు నిధులు మరిచారని గిరిజన ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పిటిసిలు స్థానిక ప్రజాప్రతినిధులు అన్న చులకన భావనగా ఉన్నారని ఆయన దిగిబెట్టారు. సంవత్సరాలు గడిచిన ప్రజాప్రతితులను పట్ల అధికారులు చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ప్రజాప్రతితులు ఉన్నారని ఆలోచన ఏ ఒక్క అధికారులు కూడా లేదని ఆయన వాపోయారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన ఏ పని కూడా స్థానిక ప్రజాప్రతితులకు తెలియపరచడం లేదని, కనీసం నాకు కూడా ఏ ఒక్క విషయం కూడా చెప్పరని ఆయన అన్నారు. గ్రామ స్థాయిలో గృహాలు నిర్మాణం , పంచాయతీరాజ్ స్థాయిలో జరిగిన పనులు, ఆర్డబ్ల్యూఎస్ స్థాయిలో జరిగే పనులు, ఏ ఒక్కటి కూడా తనకు తెలియపరచడమే కాకుండా గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మండల స్థాయిలో మండల పరిషత్తులు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఉందని ఆయన దుయ్యబట్టారు. ఏ రోజున ఏ బిల్లుకు డబ్బులు వేశారు కూడా తెలియదని స్థానికులు తమకు డబ్బులు రాలేదని, మాకు బిల్లులు రాలేదని పదేపదే మమ్మల్ని అడుగుతున్న మేము ఏమి చేయలేని పరిస్థితి ఆయన వాపోయారు .జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకు, గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కనీసం ప్రజా పరిధిలో కూడా తెలియకపోవడం విచారకరమన్నారు. దీనిపైన జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిస్తామని లేని పక్షంలో స్థానిక ప్రజాప్రతితో తక్షణ చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎంపీడీవో ఎం ఎం మంగతాయారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజాప్రతితులకు సంబంధిత ఎంపీటీసీ జడ్పిటిసి గ్రామ సర్పంచులకు కూడా నివేదించే విధంగా తగు చర్యలు చేపడతామని సభ ముఖంగా ఆమె ఇచ్చారు.