హిందూపురం టౌన్
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ టీచర్స్ ఫెడరేషన్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం స్థానిక ఎంజీఎం ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి
గంగప్ప, ప్రధానోపాధ్యాయులు సామ్రాజ్యం హాజరు కాగా మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీ ఎం టిఎఫ్ దశాబ్దకాలంగా రాజి లేనిపోరాటం చేస్తోందని రాష్ట్ర కార్యదర్శి సిద్దగిరి శ్రీనివాస్ తెలిపారు. సమస్యల పోరాటం తోనే పరిష్కారమవుతాయని వక్తలు ప్రసంగించారు. ఈ కార్య క్రమం లో సంఘం హిందూపురం అధ్యక్ష కార్యదర్శులు చంద్రనాయుక్, బాలకృష్ణ, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పెన్నోబులం, రమణ జిల్లా కౌన్సిల్ సభ్యులు కేశవరెడ్డి, రామాంజి నేయులు, సురేష్, హరి, జనార్దన్,ఆన్సర్, ఇమ్రాన్ గోవర్ధన్, మల్లికార్జున్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.