విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేసిన జిల్లా బిజెపి నాయకులు.
కామవరపుకోట :ఏలూరు పార్లమెంటు సీటు విషయంలో బిజెపి పునరాలోచన చేయాలని, పొత్తులో భాగంగా టిడిపికి చెందిన కడప నాయకుడికి సిటు కేటాయించడం తగదని, ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బిజెపి కన్వీనర్లు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విజయవాడ తెరల వెళ్లి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ప్రసాదు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో బిజెపి సంస్థాగతంగా పటిష్టం చేయడానికి విశేష కృషి చేసిన స్థానికుడైన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ ఏలూరు జిల్లా బిజెపి నాయకులు ఆదివారం విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి ని కలిసి విజ్ఞప్తి చేసి నిరసన తెలిపినట్టు చెప్పారు . గత ఐదు సంవత్సరాలుగా ఏలూరు జిల్లాలో బిజెపి ఒక బలమైన శక్తిగా గారపాటి చౌదరి ఆధ్వర్యంలో ఎదిగిందని, గారపాటి చౌదరి సేవల ద్వారా బడుగు బలహీన వర్గాల్లో మంచి పేరు సంపాదించడం వల్ల ఆయనను ఎంపీగా గెలిపించుకుంటే తమ సమస్యలు తీరుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు అని బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశామన్నారు. ఏలూరు జిల్లాలో ఉన్న కొల్లేరు సమస్య, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివి ముఖ్యమైన పనులు పూర్తి అవ్వాలంటే ఏలూరు ఎంపీగా బిజెపి అభ్యర్థి గెలుపొందితేనే సాధ్యమని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. కాబట్టి బిజెపి రాష్ట్ర కేంద్ర నాయకత్వం మరొకసారి పొత్తు లో భాగంగా ఉన్న ఇతర పార్టీలతో సంప్రదించి ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి తరఫున గారపాటి చౌదరి కే అవకాశం కల్పించాలని జిల్లా బిజెపి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్,బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కే. కృష్ణ ప్రసాద్, ఉంగుటూరు నియోజవర్గ కన్వీనర్ శరణాల మారుతిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దాన భాస్కర్, నగరపాటి సత్యనారాయణ, దెందులూరు కన్వీనర్ గుమ్మడి చైతన్య, చింతలపూడి కన్వీనర్ యేసు వరప్రసాద్, నూజివీడు కన్వీనర్ జి ఆర్ కె రంగారావు, ఏలూరు కన్వీనర్ గాది రాంబాబు, పోలవరం కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.