3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో యానిమల్ మూవీని తీసుకొచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి . మూడున్నర గంటల సినిమాతో కూడా హిట్ కొట్టి తన మార్క్ ఏంటో చూపించాడు. దీంతో యానిమల్ మూవీపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం మోత మోగిపోయింది. గత కొంతకాలంగా యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ తెగ బజ్ క్రియేట్ అయింది. యానిమల్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
యానిమల్ మూవీని 3 గంటల 29 నిమిషాలతో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఎట్టకేలకు చెప్పినట్లుగా జనవరి 26 అర్ధరాత్రి నుంచి ఓటీటీలో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అది చూసి అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యారు. దానికి కారణం థియేటర్లలో విడుదలైన రన్‌టైమ్‌తోనే యానిమల్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం.యానిమల్ మూవీలో తనకు ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్ కట్ చేశానని, వాటిని ఓటీటీ రిలీజ్‌లో యాడ్ చేసినట్లు సందీప్ రెడ్డి కూడా తెలిపాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అదనపు 8 నిమిషాలను యాడ్ చేసినట్లు తెలిపారు.కానీ థియేటర్లలో విడుదలైన 3 గంటల 21 నిమిషాల రన్‌టైమ్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్‌ను రిలీజ్ చేయడంతో అభిమానులు, అదనపు సన్నివేశాలు చూద్దామనుకున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.