Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుకర్ణాటకలో గెలిచెదెవరు

కర్ణాటకలో గెలిచెదెవరు

ప్రజాభూమి,ప్రతినిధి,కర్నాటకః
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని 150 ఎమ్మెల్యే సీట్లు టార్గెట్ పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఈసారి మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు సవాలుగా మారిపోయాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో అనేక సర్వేల ఫలితాలు విడుదల అవుతున్నాయి. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్లు మాట్లాడుకోవడానికి నోటినిండా పనిపడుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?, ఎవరు అధికారంలోకి వస్తారు ?, ఎవరు సీఎం అయితే బాగుంటుంది ?, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి అంటూ జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే విడుదల చేసింది. పవర్ స్టార్ తో ప్లాన్ చేస్తున్న బీజేపీ, పవన్ కళ్యాణ్ వస్తే లెక్క వేరే లెవల్లో ఉంటుంది ! ఇప్పటికే విడుదలైన కొన్ని సర్వేల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని కలవరపెడుతున్నాయి. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు తెలిపాయి. ఏం చెయ్యాలి అంటూ బీజేపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు జీన్యూస్-మ్యాట్రిజ్ కలసి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సర్వే నిర్వహించి ఆ సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఆ పార్టీ పనికిరాని ఇంజన్ తో సమానం, ఎంతలాగినా బండికదలదు, మోదీ రూటే సపరేటు ! జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే ఫలితాలతో బీజేపీ నాయకులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వేలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి స్థానంలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండో స్థానానికి, జేడీఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయ్యాయని సర్వేలో వెలుగు చూసింది. జీన్యూస్-మ్యాట్రిజ్ అసెంబ్లీ ఎన్నికల సర్వేలో బీజేపీకి 103 నుంచి 115 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 79 నుంచి 91 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక కర్ణాటకలో కింగ్ మేకర్ గా ఉన్న జేడీఎస్ పార్టీకి 26 నుంచి 36 సీట్లు వస్తాయని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. బీజేపీతో సహ కాంగ్రెస్ కు కూడా ఎన్నికల ప్రచారం చేస్తారా ఈ హీరో? ఏం జరుగుతోంది? జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 శాతం, కాంగ్రెస్ పార్టీ 40 శాతం, జేడీఎస్ పార్టీ 15 శాతం ఓట్లు సంపాధిస్తుందని వెలుగు చూసింది. కర్ణాటకలో అధిక సంఖ్య జనబా ఉన్న లింగాయత్ వర్గంలో ఓట్లు చీలిపోతాయని వెలుగు చూసింది. 66 శాతం లింగాయత్ లు బీజేపీకి ఓటు వేస్తారని సర్వేలో వెలుగు చూసింది. 16 శాతం లింగాయత్ లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని, 8 శాతం మంది లింగాయత్ లు జేడీఎస్ కు ఓటు వేస్తారని వెలుగు చూసింది. ఇక ఒక్కలిగుల్లో 52 శాతం జేడీఎస్ పార్టీకి, 28 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి, 4 శాతం మంది ఇతరులకు ఓటు వేస్తారని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే తెలిపింది. పలు సంస్థలు పలురకాలుగా సర్వేలు విడుదల చేస్తుండటంతో మే 13వ తేదీన అసలు సినిమా విడుదల అవుతుందని కన్నడిగులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article