Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్కర్ణాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రావాలని ఆహ్వానించాను

కర్ణాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రావాలని ఆహ్వానించాను

యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి.
ప్రజాభూమిప్రతినిధి,అమరావతిః
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని, అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని బెంగలూరులో నేరుగా కలసి కోరడం జరిగిందని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.కర్ణాటక ఎన్నికల్లో కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి ఏన్నికల పర్యటన వ్యవహారాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాను . ఈ సందర్భంగా రెండు రోజు తీరిక లేకుండా కర్ణాటకలో ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీతో ఓ నిమిషం పాటు మాట్లాడటం జరిగిందని ఆయన తెలిపారు.మోదీ గారికి మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ శుభాకాంక్షాలను తెలియచేశాను, అలాగే ఏపీలో కేంద్ర ప్రభుత్వం నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అలాగే సంక్షేమ పథకాలు కూడా కేంద్ర నిధులతో రాష్ట్రంలో చాలా వరకు అమలవుతున్నందున.. ఏపీలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. అలాగే బహిరంగసభలోనూ పాల్గోని ప్రసంగించాలని విజ్ఞప్తి చేశాను. మోదీ గారికి ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని ఆయన స్పందన ద్వారా అర్థం చేసుకున్నాని తెలిపారు .కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీ సభలకు విశేషమైన స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా మోదీ, మోదీ అనే నామస్మరణే వినిపించింది. ప్రధాని మోదీ సభల కోసం ప్రత్యేకంగా విధులు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కచ్చితంగా కర్నాటకలో బీజేపి ప్రభుత్వం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.క్షణం తీరిక లేకపోయినా మోదీ గారు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా … ఒక శ్రద్ధతో.. అధ్యాత్మికమైన పనిలాగా ఎన్నికల ప్రచారం చేయడం చూసి యువ నేతలు ఎంతో స్ఫూర్తి పొందుతారు. కర్ణాటక ఎన్నికల్లో పని చేస్తున్న నేతంలందరికీ మోదీ గారి పర్యటన , పార్టీ పని ఓ పాఠం లాంటిది. ప్రజలకు ఎలా భరోసా ఇవ్వాలి.. చేసిన అభివృద్ధి వివరించి ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొనాలి.. అనేది మోదీ గారి నుంచి ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కర్ణాటకలో మళ్లీ కమల వికాసం ఉంటుందన్న నమ్మకాన్ని వారి సభలకు వస్తున్న స్పందనతో ప్రధాని మరింత పెంచారని ఆయన తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article