అంచనాలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ తో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అధ్యయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని ..అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని … అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని …అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలని ఆదేశించారు. కల్యాణమస్తు పథకం ద్వారా నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ గా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.