Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్కవిత అరెస్టులో ఆలస్యమా…అలసత్వమా?

కవిత అరెస్టులో ఆలస్యమా…అలసత్వమా?

*నిర్లిప్తంగా ఉన్న ఈడీ
*బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనా?
*తెలంగాణలో కాషాయం కారుతో షికారు!
*ఢిల్లీలో చూపిన చొరవ తెలంగాణ లో కొరవ
*బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోతుంది
*అంతర్మథనంలో తెలంగాణ కార్యవర్గం
*పుంజుకుంటున్న కాంగ్రెస్
*బీజేపీ,బీఆర్ఎస్ ఒక్కటే నన్న నినాదం తో కాంగ్రెస్ ముందడుగు


గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలను కుది పేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నాడు అత్యంత దూకుడు పెంచిన ఈడీ ప్రస్తుతం కాస్త మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నగా మిగులుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనేకమంది ని అరెస్ట్ చెసిన ఈడీ తెలంగాణ లో ముఖ్యమంత్రి తనయ ఏమ్మెల్సీ కవిత విషయం లో ప్రదర్శిస్తున్న తీరు కొంత సంభ్రమాచ్చార్యానికి గురిచేస్తుంది.ఏపీ లో ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు గా పేరున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడ్ని ,ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారు.అదే సమయంలో కవితకు నోటీసులు ఇచ్చి కొన్ని సార్లు విచారణ కూడా చేశారు.ఒకానొక దశలో కవిత అరెస్ట్ తప్పదని భావించిన బిఎఆర్ ఎస్ నేతలు భారీగా ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుని కవిత కు సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ వేత్త ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు,మంత్రి కేటీఆర్, కవిత భర్త ఇలా అనేక మంది కవితను కచ్చితంగా అరెస్ట్ చెస్తారని ఊహించి ఆమె వెంట ఢిల్లీ నడిచారు.
ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు అందరూ కూడా కవిత అరెస్ట్ ను ఎవరూ ఆపలేరని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేసారు.
పదవతరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను కూడా బీజేపీ నేతలు సానుభూతి కోసం వాడుకున్నారు .లిక్కర్ కుంభకోణాన్ని తప్పుదోవ పట్టించేందుకే బండి అరెస్ట్ అన్న సంకేతాలను తెలంగాణ సమాజానికి ఇచ్చారు బీజేపీ నాయకత్వం. కానీ అవేమి వాస్తవం కాదా అన్న మీమాంసకు వచ్చారు ప్రజలు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణా లో పాగా వేయాలన్న కాషాయ దళానికి కవిత విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అడ్డుగా వస్తున్నాయని ఆ పార్టీ నేతల నుండి వ్యక్తమవుతోంది.
రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు స్థానిక నాయకుల వరకు బీజేపీ అధిష్టానం బీఆర్ ఎస్ తో లోపాయకారి ఒప్పందం చెసుకుందా అన్న సందేహాలు అంతర్గతంగా వ్యక్తపరుసున్నారు.ఇలా అయితే తెలంగాణ సమాజం హర్శించదు అన్న విధానానికి వచ్చి నట్లు పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తుంది.
ఇదే విషయాన్ని బలంగా తీసుకెళ్లి ప్రజల్లో తమ ఉనికిని చాటుకుని ఓటు బ్యాంకు ను కాపాడుకొనే పనిలో బిజీగా ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కర్ణాటక ఫలితాలు అనుకూలం గా రావడంతో ఇక్కడ కవిత అరెస్ట్ విషయంలో జాప్యం బీజేపీ మౌనం,కేసీఆర్ చతురత వెరసి ముందులాగా బీజేపీ పై పెద్దగా విమర్శలు చేయకపోవడం ఇవన్నీ బీజేపీ నేతలకు మైనస్ గాను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకుని రాబోవు సార్వత్రిక ఎన్నికల కు సిద్దమవుతున్నారు.
ఇది ఇలా ఉండగా ఈడీ సీబీఐ లాంటి సంస్థలు స్వయంప్రతిపత్తి కలిగినవని వాటి విషయం లో ప్రభుత్వాల పెత్తనం పెద్దగా ఉండబోదన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దామనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలిసిన అది పూర్తిగా వాస్తవానికి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో కవిత అరెస్ట్ తోనే తెలంగాణ లో బీజేపీ బ్రతికి బట్ట కడుతుందనేది ఆ పార్టీ నాయకుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article