ముదిగుబ్బ
ముదిగుబ్బ మేజర్ పంచాయతీ పరిధిలోని కస్తూరిబాయ్ కాలనీలో తిష్టవేసిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆకాలనీవాసులు డిమాండ్ చేశారు. బుధవారం కాలనీప్రజలతో కలిసి సిపిఐపార్టీ నాయకులు ఎంపీడీవో కవిరాజుతోపాటు ముదిగుబ్బ పంచాయతీ అధికారి మంజులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కాలనీవాసులతోపాటు సిపిఐ మండల కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముదిగుబ్బకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ కస్తూర్బా కాలనీలో గడిచిన ఐదు సంవత్సరాలనుండి పలుసమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని ఆకాలనీ చివరన పేదలు అష్టకష్టాలుపడి సొంతంగా గతఐదేళ్ల నుండి నిర్మించుకున్న గృహాలకు ఇంటినెంబర్లను పంచాయతీ అధికారులు కేటాయించకపోవడంతో కనీస అవసరాలు అయినా తాగునీటికులాయి, విద్యుత్ సౌకర్యం, వీధిలైట్లు, రహదారుల ఏర్పాటు తదితరవాటి సమస్యలు నెలకొన్నాయని అన్నారు. పైసమస్యలు నెరవేర్చాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియపరిచిన ప్రయోజనం సూన్యమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యల పరిష్కారదిశగా కృషిచేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలకు ఉపక్రమిస్తామన్నారు. కార్యక్రమంలో తిప్పయ్య, ఆదినారాయణ, లింగప్ప, మంగళ శీన, నారాయణ, వెంగముని తదితరులు పాల్గొన్నారు.