దివ్య గెలుపునకు అరవింద్ వర్మ ప్రచార భేరి
తుని
నిన్న మొన్నటి వరకు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. ఆ పార్టీ వెన్నంటే నిలిచి వైసిపి బలోపేతానికి తన వంతు కృషిచేసిన యువ నేత కుచ్చర్లపాటి అరవింద్ వర్మ ఇటీవల అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. యనమల సోదరుల సమక్షంలో అరవిందు వర్మ పసుపు కండువా కప్పుకున్నారు. యువతేజం అరవింద వర్మతో పాటు ఆయన అనుచరులు 150 మంది సైకిల్ ఎక్కారు. యనమల నాయకత్వానికి జై కొట్టిన అరవింద్ వర్మ తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య గెలుపు కోసం శక్తియుక్తులతో తుని వంతు కృషి చేస్తున్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో పాల్గొంటూనే మరోవైపు తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పలువురిని తెలుగుదేశం వైపు ఆకర్షితులను చేసేందుకు అరవింద్ వర్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.యువతరంగంలో మంచి పట్టు ఉన్న ఈయన తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నినాదంతో జెండా అజెండా చేతబట్టి ప్రచార భేరి మోగిస్తున్నారు. ఈ సందర్భంగా కుచ్చర్లపాటి అరవింద్ వర్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో యనమల దివ్యను అఖండ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిస్తామని చెప్పారు