జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా కె కృష్ణారావు
ప్రజాభూమి,కూనవరం:
కూనవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో త్వరలోనే గైనిక్,దంత వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీ సీ హెచ్ ఎస్) డా కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన కూనవరం (కోతులగుట్ట) సీహెచ్ సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే కూనవరం సీహెచ్ సీకి రెగ్యులర్ జనరల్ సర్జన్ , చర్మవ్యాధి నిపుణులతో పాటు ముగ్గురు రెగ్యలర్ వైద్యాధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. స్పెషలిస్ట్ పోస్టులు ఎనస్థీషియా , చిన్న పిల్లల వైద్యులు జనరల్ మెడిసిన్ పోస్టులు కూడా భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.కూనవరంలో జనరల్ సర్జరీ లు ప్రారంభించాలని సూపరింటెండెంట్ టీ వీ శేషిరెడ్డి, జనరల్ సర్జన్ మహేష్ బాబులకు సూచించారు.ఎన్ ఆర్ సీ కేంద్రం లో పోషకాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి పోషకాహారలోపం తో బాధ పడుతున్న పిల్లను గుర్తించి ఎన్ ఆర్ సీలో చేర్పించాలని,వారికి ప్రతీ రోజు కొంత నగదు ను అందజేయాలని సూచించారు. కూనవరం ఆసుపత్రి సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్ళడంతో పక్కనే ఉన్న పాత ప్రయివేటు క్వార్టర్స్ ను పరిశీంచి, వీటిని ఉపయోగపరిచే విధంగా అధికారులతో మాట్లాడతామని తెలిపారు.ఆసుపత్రిలో ని టీ బీ నిర్థారణ పరీక్షా కేంద్రాన్ని జిల్లా క్షయ నివారణ అధికారి డా. విశ్వశ్వర నాయడు పరిశీలించారు. ఈ సందర్భంగా కూనవరంలో టీబీ ల్యాబ్ లోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూనవరం, రేఖపల్లి, జీడిపప్పు వైద్యాధికారులు కె. సునీల్ కుమార్,ధనలక్ష్మి, సూర్య వైద్యులు తేజ ,సంతోష్ , అర్బాజ్ ఖాన్, హెడ్ నర్స్ బొజ్జి , డీసీహెచ్ ఎస్ పాడేరు సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.