ప్రజాభూమి వరదయ్యపాలెం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఈనెల 20.21 వ తేదీ లో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా
వరదయ్యపాలెం మండల సిపిఐ కార్యదర్శి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ కరపత్రికలు విడుదల చేయడం జరిగింది సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకే పోరుచయ కదులుదాం రండి. అంటూ నినాదిస్తూ కేంద్రంలో బిజెపి విభజన చట్టంలో పొందుపరచిన తిలోదకాలు హామీలను ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు పెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే అడ్డు గోడలుగా నిర్ణయాలు చేయడానికి తక్షణ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కత్తి ధర్మయ్య బుర్ర చంద్రశేఖర్ సిద్దులయ్య పార్టీ నాయకులు కృష్ణమూర్తి వెంకటేష్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాగార్జున మురళి తదితరులు పాల్గొన్నారు