Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుకేజ్రీవాల్ పీఎస్​, సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

కేజ్రీవాల్ పీఎస్​, సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ:‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ సన్నిహితులపై మనీలాండరింగ్​ కేసులో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్​ దాడులు చేసింది. మంగళవారం ఉదయం కేజ్రీవాల్​ పీఎస్ బిభవ్​ కుమార్​ సహా ఆప్​తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్​ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌, ఢిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు శలభ్‌కుమార్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి N.D.గుప్తా కార్యాలయంతోపాటు మరికొందరు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.మరోవైపు ఈడీ దాడులపై మంత్రి అతిషి దుయ్యబట్టారు. గత రెండేళ్లుగా ఆప్​ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని … ఎక్సైజ్​ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ ఆప్​ నేతలను ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article